Uppal Balu: ‘అగ్ని పరీక్ష 2’ షో పై ఉప్పల్ బాలు పగబట్టేసాడు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ షో గురించి ప్రతీ రోజు ఆయన కొన్ని నిజాలు చెప్తూ రీల్స్ చేస్తున్నాడు. వాటికి నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నవదీప్ పై ఉప్పల్ బాలు పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. అతని పై బూతులు కూడా ప్రయోగిస్తూ కొన్ని వీడియోలు చేసాడు. ‘అగ్నిపరీక్ష 2’ లో ఉప్పల్ బాలు పట్ల జడ్జీలు వ్యవహరించిన తీరు పట్ల నెటిజెన్స్ సపోర్టు కూడా ఉప్పల్ బాలు కి ఫుల్ గా ఉన్నది. ఆయన్ని సెలబ్రిటీ క్యాటగిరీ లో బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని రావాల్సిందే అని పట్టుబడుతున్నారు నెటిజెన్స్. మరి బిగ్ బాస్ టీం నెటిజెన్స్ డిమాండ్ ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.
ఇకపోతే ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించి మరో ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టాడు ఉప్పల్ బాలు. ఆయన మాట్లాడుతూ ‘స్టేజి మీదకు తీసుకెళ్లిన తర్వాత, ఆడిషన్స్ కోసం వచ్చిన 70 మందిని ఒక రూమ్ లోకి తీసుకెళ్లారు. ప్రతీ ఒక్కరిని 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు ఇంటర్వ్యూ చేశారు. జడ్జీల గురించి తప్పుగా మాట్లాడొద్దు , వాళ్ళ చాలా మంచోళ్ళు అని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ లు మేము ఎక్కడ రికార్డు చేస్తామో అని తెలిసే వాళ్ళు ముందుగా మా మొబైల్ ఫోన్స్ ని తీసుకున్నారు. వాళ్ళ గురించి బయట చెడుగా మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత మొబైల్ ఫోన్స్ చేతికి ఇచ్చారు’ అంటూ చెప్పుకొచ్చాడు ఉప్పల్ బాలు. అయితే ఇవన్నీ ప్రతీ రియాలిటీ షో కి కామన్ కదా , వాస్తవానికి ఇలాంటి షోస్ కి అగ్రిమెంట్ ఉంటుంది , బయటకు వెళ్లిన తర్వాత షో గురించి తప్పుగా మాట్లాడిన లీగల్ గా చర్యలు కూడా తీసుకోవచ్చు.
కానీ ‘అగ్ని పరీక్ష 2’ టీం ఆ దిశగా ఆలోచించడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ షో పై ఇప్పటికే జనాల్లో తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడింది. ఒకవేళ ఇప్పుడు లీగల్ చర్యలు తీసుకుంటే , ఇంకా తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడుతుంది అనే భయం తోనే ఆ దిశగా అడుగులు వేయడం లేదని విశ్లేషకుల అభిప్రాయం. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఉప్పల్ బాలు లేటెస్ట్ వీడియో ని మీకోసం అందిస్తున్నాము చూడండి.
View this post on Instagram