Varun Tej: ఈ ఏడాది ఫ్లాపుల్లో ఉన్న హీరోల కం బ్యాక్ గా మారిపోయింది. ఆ జాబితాలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా చేరిపోయారు. రీసెంట్ గానే ఆయన ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతూనే ఉంది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ వెనక్కి తిరిగి చూడాలని అనుకోవడం లేదు. తదుపరి సినిమాల పట్ల ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడు లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కార్తీక్ సుబ్బరాజ్ తో వరుణ్ తేజ్ ఒక సినిమా చేయబోతున్నాడు అట.
రీసెంట్ గానే వరుణ్ తేజ్ ని కలిసి ఒక మంచి లవ్ స్టోరీ ని వినిపించాడట. అది వరుణ్ తేజ్ కి తెగ నచ్చడం తో వెంటనే ఓకే చెప్పేసాడు. ఈ కాంబినేషన్ పై ఆడియన్స్ లో భవిష్యత్తులో మంచి క్రేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే, కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఆయన గత చిత్రం ‘రెట్రో ‘ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ గా నిల్చింది. కార్తీక్ సుబ్బరాజు నుండి ఇలాంటి సినిమాని ఊహించలేదు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు అప్పట్లో. కాబట్టి ఆయన సినిమాని ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి. అయితే లవ్ స్టోరీ జానర్ లో కార్తీక్ సుబ్బరాజ్ ఒక సినిమా తీసి చాలా రోజులే అయ్యింది. విభిన్నమైన ఆలోచనలు గల కార్తీక్ సుబ్బరాజు లాంటి డైరెక్టర్ లవ్ స్టోరీ ని ఎంచుకున్నాడంటే కచ్చితంగా ఎదో విశేషం ఉండే ఉంటుందని ఆశిస్తున్నారు నెటిజెన్స్.
ఇకపోతే వరుణ్ తేజ్ కి కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్స్ కూడా అత్యధిక శాతం లవ్ స్టోరీస్ కావడం విశేషం. ఆయన హీరో గా నటించిన ఫిదా, తొలిప్రేమ వంటి చిత్రాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. హీరో గా తన రేంజ్ ని బాగా పెంచాయి. సుస్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ తో చేయబోయే సినిమా వరుణ్ కి మరో భారీ హిట్ గా నిలవబోతుందా?, కార్తీక్ సుబ్బరాజ్ కి తమిళనాడు లో కూడా మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి, అక్కడ కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి వరుణ్ తేజ్ తన ఖాతాలో ఒక క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసుకున్నాడు , ఇక నుండి ఆయన కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.