Uppal Balu: సోషల్ మీడియా ని నిత్యం ఉపయోగించే నెటిజెన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు ఉప్పల్ బాలు. ఒకప్పుడు ఈయన చేసే వీడియోస్ కి నెటిజెన్స్ చిరాకు పడేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఉప్పల్ బాలు మంచితనం చూసి మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ సమయం లో ఇతను వ్యవహరించిన తీరుకి ఫిదా అయిపోయారు. జడ్జీలు ఇతన్ని తీవ్రంగా అవమానిస్తున్నప్పటికీ కూడా సహనం కోల్పోకుండా , ఆయన మాట్లాడిన మాటలు అందరి హృదయాలను హత్తుకున్నాయి. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయనకు జరిగిన అన్యాయం గురించి చెప్పడం , వాటికి నెటిజెన్స్ నుండి కూడా మద్దతు లభించడం వంటివి జరిగాయి. ఉప్పల్ బాలు కి బిగ్ బాస్ 10 లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఇవ్వాలని ఇప్పటికీ నెటిజెన్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ఇకపోతే నిన్న మొన్నటి వరకు ‘అగ్ని పరీక్ష 2’ లో తనకు జరిగిన అన్యాయం గురించి వీడియోలు చేస్తూ వచ్చిన ఉప్పల్ బాలు, ఇప్పుడు పూర్తిగా తన మార్కు వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. కాసేపటి క్రితమే ఆయన బట్టలు విప్పేసి , బాత్ టబ్బు లో స్నానం చేస్తూ ఒక వీడియో ని అప్లోడ్ చేయగా , అది ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. పైగా బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ బద్రి చిత్రం లోని ‘హే చికీతా’ పాట ని పెడుతాడు. దీన్ని చూసిన కొంతమంది నెటిజెన్స్ , ఇలాంటి పనులు చేస్తావు కాబట్టే నిన్ను బిగ్ బాస్ లోకి తీసుకోవడం లేదని కామెంట్స్ చేస్తుంటే , మరికొంత మంది మాత్రం వింటేజ్ ఉప్పల్ బాలు ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటివి చేయడం అత్యధిక శాతం మంది నెటిజెన్స్ కి నచ్చదు.
ఇలాంటి వల్గర్ వీడియోస్ చేయడం వల్లే , నవదీప్ ‘నీలాంటోళ్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపి సమాజానికి మేము ఏమి మెసేజ్ ఇవ్వాలి’ అని కామెంట్ చేసాడు. ఎందుకు పదే పదే అలాంటి మాటలు అనిపించుకోవడం , మంచి మనస్సు ఉన్న వ్యక్తివి, ఇకనైనా ఇలాంటివి ఆపు అంటూ సోషల్ మీడియా లో ఉప్పల్ బాలు ని అభిమానించే వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ కామెంట్స్ కి ఉప్పల్ బాలు నుండి రియాక్షన్ వస్తుందా లేదా అనేది చూడాలి.
View this post on Instagram