Golconda Fort: హైదరాబాద్ నగరాన్ని ఒకప్పుడు ముస్లిం రాజులు పరిపాలించారు. నిజాం పరిపాలనా కాలంలో హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేపట్టారు. చెరువులు తవ్వించారు. కొత్త కొత్త కట్టడాలు ఏర్పాటు చేశారు. అందులో నిజాం సైనికులు తలదాచుకోవడానికి.. శత్రువుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి సొరంగాలు కూడా నిర్మించారు.
హైదరాబాదులోని గోల్కొండ వద్ద రహస్య సొరంగాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.. కాకపోతే వీటిని బయటి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. సొరంగాలు ఉన్నాయని.. అందులో నిధులు కూడా ఉన్నాయని.. నిజాం పరిపాలన కాలంలో భారీగా బంగారాన్ని అక్కడ నిల్వ చేశారని ప్రచారంలో ఉంది. కానీ ఇంతవరకు వీటి గురించి వాస్తవ ఆధారాలను ఎవరూ బయట పెట్టలేదు. అయితే తొలిసారి ఈ వ్యవహారం మీద వాస్తవాలు ప్రజలకు చెప్పాలని ఆర్మీ అధికారులు నిర్ణయించుకున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్మీ అధికారులు తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ తవ్వకాలలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.
హైదరాబాదులోని గోల్కొండ లో 400 సంవత్సరాల క్రితం నాటి కృతుబ్షాహీ స్మశాన వాటిక వద్ద ఆర్మీ అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఇందులో ఒక రహస్య సొరంగం వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా గోల్కొండ నుంచి చార్మినార్ ప్రాంతానికి ఒక రహస్య మార్గం ఉందనేది తేలింది.. చాలా సంవత్సరాల క్రితం ఈ మార్గం ప్రచారంలో ఉన్నప్పటికీ దీని గురించి పూర్తి వివరాలు తెలియ రాలేదు. అయితే తాజాగా జరిపిన తవ్వకాల ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో అత్యవసరమైన పరిస్థితుల్లో రాజ కుటుంబం బయటకు వెళ్లడానికి దీనిని నిర్మించినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే నాటి కాలంలో సైన్యానికి అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు.. ఇందులో తల దాచుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
ముస్లిం రాజుల పరిపాలన కాలంలో శత్రువులు దాడి చేయకుండా ఉండడానికి ఇటువంటి సొరంగాలను నిర్మించారు. ఈ సొరంగాల గురించి రాజులకు.. సైన్యంలో పనిచేసే ఉన్నతాధికారులకు మాత్రమే తెలుసు. పైగా ఈ సొరంగాలలో నగదు.. బంగారం.. ఇతర ఖనిజాలు దాచినట్టు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంతవరకు తెలియదు. ఎందుకంటే ఆ బంగారాన్ని బయటపెట్టింది లేదు. ఆ ఖనిజాలను వెలికి తీసింది లేదు. కాకపోతే ఇప్పుడు సొరంగం మాత్రమే బయటపడింది. ఒకవేళ భవిష్యత్తు కాలంలో ఏవైనా తవ్వకాలు జరిగితే.. బంగారం బయట పెడితే.. ఎన్ని రోజులపాటు జరిగిన ప్రచారానికి వాస్తవ రూపం లభిస్తుంది.
గోల్కొండ నుంచి చార్మినార్కు రహస్య మార్గం?
హైదరాబాద్లోని గోల్కొండ 400 ఏళ్ల నాటి కుతుబ్షాహీ శ్మశానవాటిక వద్ద ఆర్మీ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఒక రహస్య సొరంగం బయటపడింది. దీంతో గోల్కొండ నుండి చార్మినార్కు రహస్యమార్గం ఉందనే ఏళ్లనాటి ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. సుల్తాన్… pic.twitter.com/GpiL8ti7aM
— BigTV APP (@BigtvApp) August 21, 2026