Homeఎంటర్టైన్మెంట్Toxic Movie: తెలుగు రాష్ట్రాల్లో హద్దులు దాటిన 'టాక్సిక్' టికెట్ రేట్స్.. సామాన్యులు థియేటర్ వైపు...

Toxic Movie: తెలుగు రాష్ట్రాల్లో హద్దులు దాటిన ‘టాక్సిక్’ టికెట్ రేట్స్.. సామాన్యులు థియేటర్ వైపు కన్నెత్తి చూసేలా లేరు!

Toxic Movie: ఇతర రాష్ట్రాల్లో మన తెలుగు సినిమాలకు అక్కడి ప్రభుత్వాలు , బయ్యర్స్ ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో మన ప్రతీ పాన్ ఇండియన్ సినిమాకు చూస్తూనే ఉన్నాం. వాళ్ళ భాషల్లో ఏ పెద్ద హీరో సినిమా విడుదల లేకపోతే పర్లేదు , షోస్ బాగానే షెడ్యూల్ అవుతాయి, ఒకవేళ వాళ్ళ భాషల్లో పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే మాత్రం మన తెలుగు సినిమాలకు ఒక్క సింగిల్ స్క్రీన్ ఇవ్వరు , మల్టీప్లెక్స్ షోస్ కూడా నామమాత్రంగానే […]

Toxic Movie: ఇతర రాష్ట్రాల్లో మన తెలుగు సినిమాలకు అక్కడి ప్రభుత్వాలు , బయ్యర్స్ ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో మన ప్రతీ పాన్ ఇండియన్ సినిమాకు చూస్తూనే ఉన్నాం. వాళ్ళ భాషల్లో ఏ పెద్ద హీరో సినిమా విడుదల లేకపోతే పర్లేదు , షోస్ బాగానే షెడ్యూల్ అవుతాయి, ఒకవేళ వాళ్ళ భాషల్లో పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే మాత్రం మన తెలుగు సినిమాలకు ఒక్క సింగిల్ స్క్రీన్ ఇవ్వరు , మల్టీప్లెక్స్ షోస్ కూడా నామమాత్రంగానే ఇస్తారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మన పెద్ద హీరో సినిమా రన్నింగ్ లో ఉన్నప్పటికీ కూడా , ఇతర బాషల హీరోల సినిమాలకు మినిమం గ్యారంటీ రిలీజ్ ఇస్తాము. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి’ ప్రభంజనం ఏ స్థాయిలో కొనసాగుతుందో కళ్లారా చూస్తూనే ఉన్నాం. వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లో కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

ఈ రేంజ్ థియేట్రికల్ రన్ ఇతర భాషల్లో వాళ్ళ హీరో సినిమాలకు ఉన్నప్పుడు మన తెలుగు పాన్ ఇండియన్ సినిమా విడుదలైతే కనీసం రెండు మూడు షోస్ కూడా ఇవ్వరు. కానీ ఇక్కడ మాత్రం ఇరుముడి థియేటర్స్ నే పీకి ‘టాక్సిక్’ లాంటి డబ్బింగ్ చిత్రానికి ఇస్తున్నారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి కూడా ఇచ్చారు. తెలంగాణ లో సింగల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ 222 రూపాయిలు కాగా , మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో ఒక్కో టికెట్ 395 వరకు ఉంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే స్పెషల్ 6 గంటల షో కి 600 రూపాయిల టికెట్ రేట్ కాగా , రెగ్యులర్ షోస్ సింగల్ స్క్రీన్స్ లో 197 రూపాయిలు, మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో 277 రూపాయిలు. వరుసగా 10 రోజుల పాటు ఈ రేట్స్ వర్తిస్తాయి.

ఈ సినిమాకు ఎలాగో ఫ్యామిలీ ఆడియన్స్ రారు. జెన్ జీ ఆడియన్స్ తమ స్నేహితులతో కలిసి థియేటర్ కి వెళ్తే కనీసం 1500 రూపాయిలు ఖర్చు అవుతుంది. ఒక డబ్బింగ్ సినిమాని చూసేందుకు ఇంత ఖర్చు చేసి వెళ్ళాలి. ఇతర భాషల్లో మనకి వాళ్ళు ఇచ్చే గౌరవానికి , మనం వాళ్లకు ఇచ్చే గౌరవానికి అసలు ఏమాత్రమైన బ్యాలన్స్ ఉందా చెప్పండి?.. టికెట్ రేట్స్ పెంచేశారు కదా , మన ఆడియన్స్ ఈ సినిమాని బ్యాన్ చేస్తారు అనే అపోహలు వద్దు, తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరో కి జరిగే రేంజ్ లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఓపెనింగ్స్ కూడా మన రాష్ట్రాల నుండి కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నాయి. చూసే ఆడియన్స్ ఉంటే , ఇలాగె ఇతర ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు మనల్ని తొక్కేసి వాళ్లకు కావాల్సినంత దోచుకొని వెళ్తారు అంటూ సోషల్ మీడియా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper