Homeఎంటర్టైన్మెంట్Toxic Movie: ఆ ప్రాంతం లో '0' టికెట్లు..'టాక్సిక్' పరువు తీసేసారుగా పాపం!

Toxic Movie: ఆ ప్రాంతం లో ‘0’ టికెట్లు..’టాక్సిక్’ పరువు తీసేసారుగా పాపం!

Toxic Movie: మరికొద్ది గంటల్లో కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం యూత్ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా క్రేజ్ ఉండేది కాదు కానీ , ఎప్పుడైతే ఈ చిత్రం నుండి ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా రావడం మొదలైందో , అప్పటి నుండి ఈ సినిమా పై క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో […]

Toxic Movie: మరికొద్ది గంటల్లో కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం యూత్ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా క్రేజ్ ఉండేది కాదు కానీ , ఎప్పుడైతే ఈ చిత్రం నుండి ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా రావడం మొదలైందో , అప్పటి నుండి ఈ సినిమా పై క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగింది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో జరిగాయి. తెలుగు , తమిళం, హిందీ తో పాటు ఇతర భాషలకు కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 60 కోట్ల రూపాయలకు చేరినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ , ఓవర్సీస్ లో మాత్రం బుకింగ్స్ అంతంత మాత్రం గానే ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకు ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్స్ ద్వారా 4 లక్షల 70 వేల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో కేవలం తెలుగు వర్షన్ నుండి 3 లక్షల డాలర్లు వచ్చాయి. కానీ తమిళం నుండి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు. అంటే గ్రాస్ సున్నా అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఉన్నటువంటి ఊపు వేరు , తమిళ వెర్షన్ కి ఉన్న ఊపు వేరు. దీన్ని బట్టీ అర్థం అవుతుంది ఏమిటంటే , తమిళ ఆడియన్స్ కేవలం వాళ్ళ సినిమాలను మాత్రమే చూస్తారు, ఇతర భాషలకు సంబంధించిన వాళ్ళ సినిమాలు చూడరు.

కానీ వాళ్ళు మాత్రం అన్ని భాషల్లోనూ తమ సినిమాలను విడుదల చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆడియన్స్ ప్రోత్సహిస్తున్నారు కూడా. అయితే టాక్సిక్ చిత్రానికి తమిళ వెర్షన్ లో జీరో టికెట్స్ అమ్ముడుపోవడం పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్స్. మరోపక్క కాసేపటి క్రితమే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 50 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఓపెనింగ్స్ 100 కోట్ల గ్రాస్ కి ఒక్క పైసా కూడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper