Telangana Theatres: రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రతీసారి ప్రభుత్వాల నుండి ప్రత్యేక అనుమతులు తీసుకోవడం , జీవో వచ్చే వరకు ఎదురు చూడడం వంటివి ఈ మధ్య కాలం లో రొటీన్ ప్రక్రియ అయిపోయింది. అందుకే రెండు ప్రభుత్వాలు డైనమిక్ టికెట్ ప్రైజింగ్ పై మొగ్గు చూపుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ముందుగా తెలంగాణ ప్రభుత్వమే డైనమిక్ టికెట్ ప్రైజింగ్ మోడల్ ని నేడు ప్రవేశ పెట్టింది. ముందు తో పోలిస్తే టికెట్ రేట్స్ ఇప్పుడు బాగా పెరిగాయి. పెరిగిన టికెట్ రేట్స్ నుండి వచ్చే ఆదాయం లో 20 శాతం సినీ కార్మికుల సంఘానికి ఇవ్వాలని ప్రభుత్వం షరతు పెట్టింది. ఈ ఒక్క అంశం నిర్మాతలకు కాస్త కష్టమైనదే అని చెప్పాలి. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయింది , టికెట్ రేట్స్ పెంచితే తప్ప డబ్బులు రీకవర్ అవ్వని పరిస్థితి.
ఇలాంటి సందర్భంలో కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వడం అంటే చాలా కష్టమైన విషయమే. దీన్ని సినీ నిర్మాతలు ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఇదంతా పక్కన పెడితే సింగిల్ స్క్రీన్స్ , మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లలో కొత్త టికెట్స్ రేట్స్ సిస్టం ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
నాన్ AC సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో ‘నా ప్రీమియం’ క్లాస్ కి 30 నుండి 70 రూపాయిల వరకు టికెట్ రేట్ పెంచుకోవచ్చని , అదే విధంగా ‘ప్రీమియం’ క్లాస్ కి 50 నుండి 100 రూపాయిల వరకు టికెట్ రేట్ పెంచుకోవచ్చని జీవో జారీ చేసింది. అదే విధంగా AC సింగిల్ స్క్రీన్ థియేటర్స్ విషయానికి వస్తే ‘నాన్ ప్రీమియం’ క్లాస్ కి 50 నుండి 150 రూపాయిల వరకు , ‘ప్రీమియం’ క్లాస్ కి 100 – 200 వరకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని తెల్పింది. ఇక మల్టీప్లెక్స్ థియేటర్స్ విషయానికి వస్తే ‘రెగ్యులర్’ క్లాస్ కి 100 నుండి 250 వరకు , రిక్లైనర్స్ కి 200 నుండి 300 రూపాయిల వరకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని జీవో లో పేర్కొన్నారు.
ఇక డాళ్బీ అట్మాస్ సౌండ్ మరియు అదనపు ఫీచర్స్ ఉన్న సింగిల్ స్క్రీన్స్ , మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ‘నాన్ ప్రీమియం’ టికెట్ రేటు 100 నుండి 250 వరకు , అదే విధంగా ‘ప్రీమియం’ టికెట్ రేటు 200 నుండి 300 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. హైదరాబాద్ లో దాదాపుగా ప్రతీ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో అనేక రకమైన ఫీచర్స్ గల థియేటర్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు 150 రూపాయిల రేంజ్ లో ఉన్న టికెట్ రేట్ , సింగిల్ స్క్రీన్స్ లో 295 వరకు పెంచుకోవచ్చు అన్నమాట. ఇది నిర్మాతలకు జాక్ పాట్ లాంటిదని చెప్పాలి. పెరిగిన ఈ టికెట్ రేట్స్ టాలీవుడ్ లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చూడాలి మరి.