Homeఎంటర్టైన్మెంట్Ram Charan: 'మల్లెపూల పల్లకి' పాటలో రామ్ చరణ్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ ట్వీట్..

Ram Charan: ‘మల్లెపూల పల్లకి’ పాటలో రామ్ చరణ్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ ట్వీట్..

Ram Charan: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ రవితేజ కం బ్యాక్ ని సూచిస్తూ వచ్చింది. రీసెంట్ గా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మోస్ట్ అవైటెడ్ ‘బంగారు పల్లకి’ పాటని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ , […]

Ram Charan: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ రవితేజ కం బ్యాక్ ని సూచిస్తూ వచ్చింది. రీసెంట్ గా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మోస్ట్ అవైటెడ్ ‘బంగారు పల్లకి’ పాటని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది వాయిస్ బాగాలేదని కంప్లైంట్స్ ఇచ్చారు కానీ , రవితేజ మాస్ స్టెప్పులు ఆ లోటు ని పూడ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్స్ లో కచ్చితంగా ఈ పాట కి ప్రేక్షకులు జాతర ని తలపించే రేంజ్ సంబరాలు చేస్తారని అంటున్నారు విశ్లేషకులు.

ఇదంతా పక్కన పెడితే , గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా రవితేజ తో కలిసి చిందులు వేసాడని, ప్రస్తుతం ఈ అంశాన్ని సర్ప్రైజ్ గా ఉంచారని , విడుదల రోజు ఆడియన్స్ కి రామ్ చరణ్ ఎంట్రీ ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందని , ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి. ఈ రూమర్ బాగా వైరల్ అవ్వడం తో , రామ్ చరణ్ పీఆర్ టీం స్పందించింది. సోషల్ మీడియా లో ‘బంగారు పల్లకి’ పాటలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అనే ప్రచారం మా దృష్టికి వచ్చింది. అందులో ఎలాంటి నిజం లేదంటూ స్పష్టం చేశారు. ముందుగా ఈ పాటలో రామ్ చరణ్ క్యామియో ఉందని తెలిసి మెగా అభిమానులు చాలా సంతోషించారు , ఇప్పుడు లేదని ఖరారు చేయడం తో నిరాశకు గురయ్యారు.

ఇక ‘ఇరుముడి’ విశేషాల్లోకి వెళ్తే , రవితేజ ఈ చిత్రం తో కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడనే నమ్మకం తో ఉన్నారు అభిమానులు. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్స్ ని అందుకుంటూ తన మార్కెట్ ని రిస్క్ లో పడేసాడు రవితేజ. కానీ ఈ ఏడాది ఫ్లాప్ హీరోలకు కం బ్యాక్ ఏడాది గా ఎలా మారిందో , రవితేజ కి కూడా అలాంటి కం బ్యాక్ ఏడాది గా ఈ చిత్రం నిలుస్తుందని , మొదటి వారం లోనే ఈ చిత్రం తో 100 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు సైతం. మరి అందరి అంచనాలు నిజం అవుతాయో లేవో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper