Irumudi Movie: కుంభస్థలం బద్దలు కొట్టడం అంటే ఏంటో తెలుసా..? అయితే ఒక్కసారి బుక్ మై షో యాప్ తెరిచి , ‘ఇరుముడి’ అడ్వాన్స్ బుకింగ్స్ చూడండి. నైజాం , సీడెడ్ , కర్ణాటక , తమిళనాడు అని తేడా లేదు , ఒక్కటే దంచుడు. సంక్రాంతి సినిమాలకు కూడా ఈ రేంజ్ వసూళ్ల సునామీ చూడలేదని , రవితేజ కి సరైన సినిమా పడితే , ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ అవ్వుద్దా అంటూ ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్ళబెట్టి అలా చూస్తుండిపోయాడు. ఇలాంటి వసూళ్ల సునామీ ఈమధ్య కాలం పాన్ ఇండియన్ హీరోలకు కూడా చూడలేదని, ఇప్పట్లో ఈ వసూళ్ల సునామీ ఆగేలా లేదని అంటున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రవితేజ కెరీర్ లోనే నెంబర్ 1 ఓపెనింగ్ ఇది.
అయితే మొదటి రోజు థియేటర్స్ డిమాండ్ కి తగ్గట్టు దొరకలేదని , లేదంటే ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవని అంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే రెండవ రోజు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ శివ తాండవం ఆడుతున్నాడు అనే చెప్పాలి. చిన్న చిన్న మాస్ సెంటర్స్ నుండి , అర్బన్ సిటీల వరకు ఈ చిత్రానికి నమోదు అవుతున్న హౌస్ ఫుల్స్ ని చూస్తుంటే మతి పోతుంది. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే , గడిచిన 10 ఏళ్ళల్లో ఏ పెద్ద హీరో సాధించలేని అరుదైన రికార్డు ని , ఈ చిత్రం సాధించింది అట. కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని పొంది అన్న బీటబుల్ రికార్డు ని నెలకొల్పినట్టు సమాచారం. విడుదలకు ముందు ఈ చిత్రానికి కేవలం 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది.
మొదటి రోజే 15 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక రెండవ రోజు అయితే అంతకు మించిన షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రెండు రోజుల్లో ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయట. అంటే రెండు రోజుల్లోనే 10 కోట్ల రూపాయిల లాభాలు అన్నమాట. ఈ స్థాయి కుమ్ముడు బహుశా మూవీ టీం కలలో కూడా ఊహించి ఉండదేమో. కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఫుల్ రన్ లో కచ్చితంగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది సోమవారం నమోదయ్యే వసూళ్లను బట్టి తెలుస్తుంది.