Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం చాలా సాధారణమైన అంచనాల నడుమే రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 21 కోట్లు మాత్రమే. ఇంత తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడానికి ప్రధాన కారణం, ఈ సినిమాకు ఇంత తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడానికి కారణం , రవితేజ గత చిత్రాలు ఘోరమైన డిజాస్టర్స్ గా నిలబడడం వల్లే. బ్రేక్ ఈవెన్ మార్కుని దాటితే చాలు అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ, కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం బయ్యర్స్ 51 కోట్ల రూపాయిల లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ రోజు ఈ చిత్రం పేరు మీద ఆల్ టైం రికార్డు నమోదు అవుతూనే ఉంది.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 6 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక ప్రాంతాల వారీగా 6 రోజుల్లో ఈ చిత్రానికి నమోదైన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం నుండి 29 కోట్ల 18 లక్షలు, సీడెడ్ నుండి 8 కోట్ల 17 లక్షలు , ఉత్తరాంధ్ర నుండి 5 కోట్ల 80 లక్షలు, ఈస్ట్ గోదావరి నుండి 4 కోట్ల 10 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 2 కోట్ల 44 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 3 కోట్ల 70 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 3 కోట్ల 34 లక్షలు, నెల్లూరు నుండి 1 కోటి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 58 కోట్ల 52 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 93 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 7 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 125 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 72 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ 6 రోజుల్లో వచ్చిన లాభాలు అక్షరాలా 51 కోట్ల 27 లక్షలు అన్నమాట. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి కళ్ళు చెదిరే వసూళ్లు నమోదు అవ్వబోతున్నాయి. వంద కోట్ల షేర్ మార్కుని కూడా ఈ చిత్రం ఈ వీకెండ్ లోనే అందుకోనుంది. రాబోయే రోజుల్లో ఈ వసూళ్ల సునామీ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.