Irumudi Movie: తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి‘ వసూళ్ల సునామీ జోరు ఏ మాత్రం తగ్గలేదు. 7 రోజుల్లో 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా 8 వ రోజున మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద చెలరేగిపోయింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 8 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. 100 ఏళ్ళ తెలుగు చలన చిత్ర చరిత్ర లో వర్కింగ్ డే రోజున 8 వ రోజు ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన చిత్రం మరొకటి లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొత్తం మీద ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 70 కోట్ల 58 లక్షల షేర్ వసూళ్లు, 112 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 85 కోట్ల 45 లక్షల షేర్ వసూళ్లు, 146 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ మార్కుకి చాలా దగ్గరగా వెళ్తుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే, ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ప్రియా భవాని శంకర్ కి ఎంత మంచి పేరొచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం ముందుగా అనేక మంది హీరోయిన్స్ ని సంప్రదించాడట డైరెక్టర్ శివ నిర్వాణ. అందులో ముందుగా ఆయన ప్రముఖ హీరోయిన్ సమంత ని సంప్రదించాడట. ఈమెతో గతంలో ఆయన మజిలీ, ఖుషి వంటి చిత్రాలు చేసాడు. ఆమెతో మంచి రిలేషన్ ఉండడం తో, ఈ పాత్ర కోసం సంప్రదించాడట. కానీ సమంత తన రేంజ్ తగ్గట్టుగా లేదని ఈ పాత్రని రిజెక్ట్ చేసినట్టు అప్పట్లో ఒక రూమర్ వినిపించింది.
ఇక ఆ తర్వాత నయనతార, అనుష్క వంటి వారిని కూడా సంప్రదించారట. నయనతార సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ సినిమా అనుష్క చేసుంటే, ఆమె కెరీర్ కి చాలా గొప్పగా ఉపయోగపడేది. గతంలో రవితేజ ఈమెతో కలిసి విక్రమార్కుడు, బలాదూర్ వంటి సినిమాలు చేసాడు. వీళ్ళతో పాటు ప్రముఖ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ని కూడా సంప్రదించారట. ఆమె కూడా డేట్స్ సర్దుబాటు కాక నో చెప్పినట్టు తెలుస్తోంది. ఈమెకు గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ క్రేజీ హీరోయిన్స్ ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవడం వల్ల , ఒక తమిళ హీరోయిన్ కి టాలీవుడ్ లో కెరీర్ చాలా గొప్పగా మొదలైంది అని చెప్పొచ్చు.