Irumudi Movie: టాలెంట్ ఉన్న నటీనటులకు, ఓవర్ నైట్ గుర్తింపు రావాలంటే, ఒకే ఒక్క సరైన సూపర్ హిట్ సినిమా తగిలితే చాలు, వాళ్ళు కలలో కూడా ఊహించని రేంజ్ కి వెళ్ళిపోతారు అనేందుకు మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్ గా అలా ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఆర్టిస్టు ‘కొమురం’. ఇతను జబర్దస్త్ ద్వారా ఎన్నో ఏళ్ళ నుండి బుల్లితెర ఆడియన్స్ కి సుపరిచితమే. ఇతనికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇన్ని రోజులు ‘కొమురం’ ని ‘కొమురక్క’ గా, లేడీ గెటప్ లోనే మన తెలుగు ఆడియన్స్ చూస్తూ వచ్చారు. అలాంటి కొమురక్క ఒక్కసారిగా తన నటవిశ్వరూపాన్ని ‘ఇరుముడి’ చిత్రం లో చూపించాడు. ఇందులో ఆయన పోషించిన ‘నాగులు’ క్యారెక్టర్ కి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఎవరు ఇతను, కొత్త నటుడు లాగా ఉన్నాడే, చాలా అద్భుతంగా నటించాడు, ఇతనికి మంచి భవిష్యత్తు ఉందని సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు అనుకొనే ఉంటారు. అయితే అలా అనుకున్న ప్రేక్షకులు ఇతను ‘కొమురక్క’ అనే విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇతనిలో ఈ యాంగిల్ కూడా ఉందా?, చాలా ఆశ్చర్యం గా ఉందే అని సోషల్ మీడియా లో ఈయనపై నెటిజెన్స్ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. అయితే సినిమా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో హిట్ అయ్యి, కాసుల కనకవర్షం కురిపిస్తుండడంతో, రెమ్యూనరేషన్స్ కూడా నటీనటులకు బాగానే ఇచ్చినట్టు తెలుస్తోంది.
‘కొమురం’ కి ఈ సినిమాకు రెమ్యూనరేషన్ గా పాతిక లక్షల రూపాయిలు ఇచ్చారట మేకర్స్. అంతే కాదు, ‘ఇరుముడి’ తర్వాత కొమురం కి సినిమా అవకాశాలు కూడా వరుసగా క్యూలు కడుతున్నాయట. భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో కూడా ఇతనికి అవకాశాలు వస్తున్నాయట. నాగులు అనే పాత్ర ఇతని జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. రాబోయే రోజుల్లో ఈయన కూడా గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది తరహాలో , వరుసగా సినిమాలు చేస్తూ , ఫుల్ బిజీ గా మారుతాడా లేదో చూడాలి. ఏది ఏమైనా ‘కొమురం’ కి ‘ఇరుముడి’ చిత్రం పెద్ద జాక్పాట్ గా నిలిచిందని చెప్పొచ్చు.