Irumudi Movie: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా భారీ విజయాన్ని సాధించి ముందుకు దూసుకెళ్తుంది. రెండో వారంలో కూడా ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతూ ఉండడం విశేషం…150 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టిన ఈ మూవీ రెండో శుక్రవారం 11.5 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి పుష్ప 2, బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం ‘త్రిబుల్ ఆర్’ సినిమా 14.5 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా ఇరుముడి ఆ తర్వాత స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండో శుక్రవారం కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబడుతోంది అంటే ఈ సినిమాని చూసే ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య మరింత పెరిగిపోతుందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరి రికవర్ లను బ్రేక్ చేస్తూ రవితేజ ముందుకు దూసుకెళ్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఒకెత్తయితే ఇప్పుడు సాధించిన ఈ ఇరుముడి విజయం మరొకెత్తుగా చెప్పుకోవచ్చు. గతంలో అతనికి సక్సెస్ అయితే దక్కలేదు. దాంతో అతన్ని చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు.
మొత్తానికైతే డిఫరెంట్ సబ్జెక్టుతో వచ్చి ప్రేక్షకులందరిని ఆకట్టుకున్న రవితేజ రాబోయే సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు… తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాలను సాధిస్తాడా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
దిల్ రాజు ప్రొడ్యూసర్ గా హసిత్ గోలీ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటుండటం విశేషం…
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. రవితేజతో కొత్త సినిమాను ప్రకటించడంతో రవితేజ – వివేక్ ఆత్రేయ కాంబినేషన్ కి చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది…