Homeఎంటర్టైన్మెంట్Shiva Nirvana: 'ఇరుముడి' మూవీ ఆయనొక్కడు నమ్మకపోతే పట్టలెక్కేది కాదు : శివ నిర్వాణ

Shiva Nirvana: ‘ఇరుముడి’ మూవీ ఆయనొక్కడు నమ్మకపోతే పట్టలెక్కేది కాదు : శివ నిర్వాణ

Shiva Nirvana: రవితేజ హీరోగా ‘శివ నిర్వాణ’ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా 180 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది. ఏది ఏమైనా కూడా ఈ సినిమా 200 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనేది వాస్తవం. ఇక ఇలాంటి క్రమంలోనే రవితేజ కి పెద్దగా మార్కెట్ లేదంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేశారు. కానీ మొత్తానికైతే ఆయన 200 కోట్ల మార్క్ ను […]

Shiva Nirvana: రవితేజ హీరోగా ‘శివ నిర్వాణ’ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా 180 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది. ఏది ఏమైనా కూడా ఈ సినిమా 200 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనేది వాస్తవం. ఇక ఇలాంటి క్రమంలోనే రవితేజ కి పెద్దగా మార్కెట్ లేదంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేశారు. కానీ మొత్తానికైతే ఆయన 200 కోట్ల మార్క్ ను అందుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ‘ఇరుముడి’ కథని శివ నిర్వాణ రవితేజ కంటే ముందు చాలామంది హీరోలకు చెప్పాడు కానీ వాళ్లెవరూ ఆయన్ని నమ్మలేదు.

రవితేజ మాత్రం శివ నిర్వాణ చెప్పిన కథకి బాగా కనెక్ట్ అయిపోయి సినిమాని చేశాడు. అలాగే త్రినాథ్ రావు అనే పాత్రలో నటించి ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోశాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా రవితేజ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ ప్రతి ఒక్కరు అతని మీద ప్రశంశాల వర్షాన్ని కురిపిస్తున్నారు.

రవితేజ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కథలు చేస్తే ఆయనకు మరింత క్రేజ్ పెరుగుతుందని ప్రతి ఒక్క ప్రేక్షకుడు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే శివ నిర్వాణ మాట్లాడుతూ రవితేజ ఈ కథని నమ్మకపోతే ఈ సినిమా బయటికి వచ్చుండేది కాదని అప్పటికే చాలామంది హీరోలు ఈ కథను రిజెక్ట్ చేయడంతో శివ నిర్వాణ ఈ కథను పక్కన పెడదామని అనుకున్నానని చెప్పాడు. కానీ మొత్తానికైతే రవితేజ కథను నమ్మి ఈ సినిమాను చేశాడు. దాంతో మా ఇద్దరికి పెద్ద సక్సెస్ దక్కిందని ఆయన కామెంట్స్ చేశాడు.

మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేస్తాడు ప్రేక్షకుల్లో ఒక అటెన్షియన్ ను క్రియేట్ చేయగలిగే సినిమాలను చేయగలుగుతాడా? లేదంటే మళ్ళీ రొటీన్ రొట్టా ఫార్ములా లోకే వెళ్లిపోతాడా అనేది తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం రవితేజ హసిత్ గోలి దర్శకత్వంలో ఒక సినిమాకి కనెక్ట్ అయ్యాడు. దీనిని దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper