Avenue Supermarts: మాల్స్ పెట్టినప్పటి నుంచి తొలిసారి..డీమార్ట్ 1000 కోట్ల అప్పు .. అసలేంటి కథ
భారతదేశంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కిరాణం సరుకులు కొనాలంటే డీమార్ట్ వైపు పయనిస్తూ ఉంటారు. గుండు పిన్ను నుంచి ఖరీదైన వస్తువుల వరకు ఒక్కచోట లభించే ఈ మార్కెట్ కు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తుంది. తక్కువ ధరలకే సరుకులు అందిస్తూ.. కొన్నింటికి డిస్కౌంట్లను ప్రకటించడంతో ఈ స్టోర్ ఎక్కడ స్థాపించిన వినియోగదారులు క్యూ కడుతున్నారు. అయితే ఈ స్టోర్స్ యాజమాన్యం ఏడేళ్ల తర్వాత సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. తొలిసారి 1000 కోట్ల అప్పు చేయబోతుంది. ఈ అప్పు చేయడానికి కారణాలేంటో తెలిస్తే షాక్ అవుతారు. అసలేంటి ఈ అప్పు కథ?
డి మార్ట్ పాత సంస్థ అవెన్యూ సూపర్ మార్క్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిని విస్తరించడానికి రాధా కిషన్ దమాని 1000 కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులను సేకరించడానికి కార్పొరేట్ బాండ్లను రిలీజ్ చేయనుంది. కంపెనీ మూడేళ్ల కాలంలో ఉండే షార్ట్ టర్మ్ బాండ్ లాగా ఇవి ఉంటాయి. దీనికోసం ఇప్పటికే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ప్రక్రియ మొదలు కానుంది.
అయితే 2019లో బాండ్ల ద్వారా నిధులను డీమార్ట్ సేకరించింది. అప్పట్లో 13 నెలల కాలపరిమితితో బాండ్లను జారీ చేసినప్పటికీ ఆరు నెలలకే వాటిని తిరిగి చెల్లించేసింది. అయితే ఇప్పుడు జారీస్ చేయబోయే బాండ్లకు ప్రముఖ రేటింగ్ సంస్థ ICRA అత్యుత్తమ రేటింగ్ అయిన AAA ఇచ్చినట్లు తెలుస్తోంది. దేశంలోని అతిపెద్ద కిరాణా రిటైలర్ గా ఈ సంస్థకు ఇప్పటికే గుర్తింపు ఉంది. దీనిని పరిగణలోకి తీసుకొని అద్భుతమైన ప్రొక్యూర్మెంట్ సామర్థ్యాలు, వినియోగదారుల తాకిడి పెరిగి స్థిరమైన మార్జిన్లు వస్తాయని ఐ సి ఆర్ ఏ పేర్కొంది.
ఇటువంటి కేటగిరీలో సంస్థలు తక్కువగా ఉండడంతో ముచువల్ సంస్థల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై డిమార్ట్ అధికారికంగా మాత్రం ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ కామర్స్ డెలివరీ సంస్థల నుంచి గట్టి పోటీ తయారవుతున్న తరుణంలో డిమార్ట్ సొంతంగా ఈ కామర్స్ ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతర్గత నిలువలు మాత్రమే కాకుండా ఇలా బాండ్ల ద్వారా నిధులు సేకరించి దేశంలో ప్రతి చోట డీమార్ట్ సంస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.