Homeఎంటర్టైన్మెంట్Tollywood Hero Missed Dhurandhar: 'ధురంధర్' చిత్రాన్ని మిస్ అయిన టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్...

Tollywood Hero Missed Dhurandhar: ‘ధురంధర్’ చిత్రాన్ని మిస్ అయిన టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో అతనేనా? మామూలు బ్యాడ్ లక్ కాదుగా!

Tollywood Hero Missed Dhurandhar: గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. నిన్న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. హిందీ,తెలుగు తో పాటు ఇతర ప్రాంత ప్రాంతీయ భాషల్లో కూడా ఏఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. కనీసం ఇప్పుడైనా థియేట్రికల్ రన్ ఆగుతుందేమో అని అనుకున్నారు. కానీ ఈరోజు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో ద్వారా 8 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి అంటే, ఈ చిత్రం ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామీ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు సీక్వెల్ మార్చ్ 19 న రాబోతుంది. అంటే పట్టుమని 50 రోజులు కూడా లేవు. అయినప్పటికీ మొదటి భాగం ఇంకా థియేటర్స్ లోనే ఆడుతుంది. బహుశా ఈ చిత్రం సీక్వెల్ వచ్చే వరకు థియేటర్స్ లో ఆడుతూనే ఉంటుందేమో, పరిస్థితి చూస్తే అలాగే ఉంది.

ఈ చిత్రానికి ఆదిత్య డర్ దర్శకత్వం వహించాడు. గతం లో ఈయన విక్కీ కౌశల్ తో URI లాంటి సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమాకు నేషనల్ అవార్డ్స్ వరద వచ్చింది. ఇప్పుడు ‘ధురంధర్’ కి కూడా అలాంటి గౌరవం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య డర్ గతం లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఇలాంటి దేశభక్తి సినిమాని చేద్దామని అనుకున్నాడట. ముంబై లో రామ్ చరణ్ ఉన్నప్పుడు ఆయన్ని కలిసి కథ కూడా వినిపించాడట. కానీ ఆ సమయం లో రామ్ చరణ్ రాజమౌళి #RRR మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఒకవేళ ఆదిత్య డర్ తో రామ్ చరణ్ సినిమా చేసుంటే వేరే లెవెల్ ఉండేది అని విశ్లేషకులు అంటున్నారు. ‘ధురంధర్’ చిత్రాన్ని చూస్తున్నంత సేపు చాలా మంది మూవీ లవర్స్ కి ఈ సినిమా రామ్ చరణ్ కి పడుంటే చాలా బాగుండేది అని అనుకున్నారు.

అయితే ఆదిత్య డర్ చెప్పిన స్టోరీ ‘ధురంధర్’ యేనా?, లేదంటే వేరే స్టోరీ ఏదైనా చెప్పాడా?, రెండేళ్ల క్రితం చెప్పిన స్టోరీ అంటే , ఎందుకో అది ‘ధురంధర్’ సినిమానే ఏమో అనే అనుమానం అభిమానుల్లో ఉంది. ఒకవేళ అదే నిజమైతే అభిమానుల ఆర్తనాదాలు మామూలు రేంజ్ లో ఉండవు. మన టాలీవుడ్ హీరోలు భవిష్యత్తులో గొప్ప పాన్ ఇండియన్ సినిమాలు చేయొచ్చు, కానీ ఇలాంటి సంచలనాత్మక చిత్రాన్ని మాత్రం చేయలేరు. జీవితాంతం గుర్తించుకోదగ్గ చిత్రమిది. అలాంటి సినిమా రామ్ చరణ్ కి మిస్ అయ్యుంటే మాత్రం చాలా కాస్ట్లీ మిస్ అని అంటున్నారు విశ్లేషకులు. ఎలాగో వీళ్లిద్దరి మధ్య చర్చలు జరిగాయి కాబట్టి, భవిష్యత్తులో అయినా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే బాగుండును అని అంటున్నారు ఫ్యాన్స్.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular