Ram Charan తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియాలో తన పేరు ప్రఖ్యాతలను టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లిన రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత మరో సక్సెస్ ని సాధించడంలో చాలావరకు విఫలమవుతున్నాడు. రీసెంట్ గా పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో అతని అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు…ఇక దానికి తోడుగా ఆయనకు రీసెంట్ గా చెయ్యి మణికట్టు దగ్గర సర్జరీ జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ కి బ్యాడ్ ఫ్యాన్స్ ఫేజ్ నడుస్తుంది అంటూ అతని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆయన ఒక సినిమా కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంతకంటే ఎక్కువగానే పెడుతున్నాడు.
కానీ సక్సెస్ అయితే దక్కడం లేదు. శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని అందరు నమ్మారు. కానీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోగా ప్రొడ్యూసర్స్ కి నష్టాలను మిగిల్చింది. పెద్ది సినిమాతో సైతం ఆయన డిఫరెంట్ అటెంప్ట్ ను ట్రై చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు.
దాంతో ఇప్పుడు సుకుమార్ సినిమాతో సక్సెస్ ని సాధించడానికి ఆయన ఈ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు…ఇక ఈ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలకు సైతం ఆయన కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఆ సినిమాలన్నింటిని తెరమీదకి పర్ఫెక్ట్ గా తీసుకొచ్చి విజయాలను సాధించి తనకంటూ ఉన్న గుర్తింపును నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు ముందుకు దూసుకెళ్తుంటే ఆయన మాత్రం రోజురోజుకి వెనుకబడి పోతున్నాడు. కాబట్టి రాబోయే సినిమాలు సక్సెస్ ని సాధిస్తేనే ఆయన మరోసారి తన సత్తాను చాటుకున్న వాడవుతాడు. లేకపోతే మాత్రం పూర్తిగా డీలా పడిపోతాడు…