Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni: ఆ స్టార్ హీరోతో మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న అక్కినేని అఖిల్......

Akhil Akkineni: ఆ స్టార్ హీరోతో మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న అక్కినేని అఖిల్… కథ కూడా సెట్ అయిందిగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వరరావు దగ్గర నుంచి అఖిల్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇమేజ్ ను కాపాడుకుంటూ ముందుకు సాగిన వాళ్లే కావడం విశేషం… నాగార్జున సైతం ఈ ఏజ్ లో కూడా డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 12 సంవత్సరాల అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఆయనకు సరైన సక్సెస్ లేదని బాధపడుతున్న అభిమానులకు ఈ సంవత్సరం […]

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వరరావు దగ్గర నుంచి అఖిల్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇమేజ్ ను కాపాడుకుంటూ ముందుకు సాగిన వాళ్లే కావడం విశేషం… నాగార్జున సైతం ఈ ఏజ్ లో కూడా డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 12 సంవత్సరాల అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఆయనకు సరైన సక్సెస్ లేదని బాధపడుతున్న అభిమానులకు ఈ సంవత్సరం ఆయన లెనిన్ సినిమాతో ఒక భారీ విజయాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. దాంతో వాళ్ళ అభిమానులు సైతం ఆనందపడుతున్నారు. ప్రస్తుతం అఖిల్ స్టార్ డైరెక్టర్లతో మంతనాలు జరుపుకున్నట్టుగా తెలుస్తుంది. అతనితో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే అఖిల్ మాత్రం రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దానికోసం ఒక పవర్ ఫుల్ కథను కూడా సిద్ధం చేయించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ – అఖిల్ కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కబోతుందట.

ఇక ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహించబోతున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటి రాలేదు. కానీ ఒక ఎగ్జైటింగ్ పాయింట్ తో అఖిల్ ఈ కథను సిద్ధం చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని రామ్ చరణ్ కి కూడా చెప్పారట. తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఎవరి క్యారెక్టర్లు ఏంటి అనే విషయాలకు సంబంధించిన పూర్తి క్లారిటీని ఇవ్వడానికి సినిమా యూనిట్ సిద్ధమవుతున్నారట.

ఇక ఏది ఏమైనా కూడా లెనిన్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్లాడు. కాబట్టి అతను రాబోయే సినిమాల మీద కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరమైతే ఉంది. అందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా మరోసారి అతనికి భారీ ఫ్లాపులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper