Homeఎంటర్టైన్మెంట్Ram Charan Surgery: ఉపాసన అపోలో హాస్పిటల్స్ ఉండగా రామ్ చరణ్ కోయంబత్తూర్ హాస్పిటల్ లో...

Ram Charan Surgery: ఉపాసన అపోలో హాస్పిటల్స్ ఉండగా రామ్ చరణ్ కోయంబత్తూర్ హాస్పిటల్ లో ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నాడు?

Ram Charan Surgery: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిన్న కోయింబత్తూర్ లోని గంగా హాస్పిటల్స్ లో మణికట్టు సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై సోషల్ మీడియా లో పెద్ద చర్చ నే నడుస్తోంది. ‘పెద్ది’ మూవీ షూటింగ్ సమయం లో రామ్ చరణ్ మణికట్టుకి గాయం అవ్వడం మన అందరికీ తెలిసిందే. కానీ ఆయన గాయం అయ్యినప్పటికీ కూడా , మొండిపట్టుతో షూటింగ్ పూర్తి చేసి , పెద్ది సినిమాని సకాలంలో […]

Ram Charan Surgery: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిన్న కోయింబత్తూర్ లోని గంగా హాస్పిటల్స్ లో మణికట్టు సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై సోషల్ మీడియా లో పెద్ద చర్చ నే నడుస్తోంది. ‘పెద్ది’ మూవీ షూటింగ్ సమయం లో రామ్ చరణ్ మణికట్టుకి గాయం అవ్వడం మన అందరికీ తెలిసిందే. కానీ ఆయన గాయం అయ్యినప్పటికీ కూడా , మొండిపట్టుతో షూటింగ్ పూర్తి చేసి , పెద్ది సినిమాని సకాలంలో థియేటర్స్ లో విడుదలయ్యేలా చేశాడు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ సతీమణి ఉపాసన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్ కి చైర్మన్. ప్రపంచం లో ఉన్న బెస్ట్ స్పెషలిస్ట్స్ అందరూ వీళ్లకు అందుబాటులో ఉంటారు. అలాంటి అపోలో హాస్పిటల్స్ ని వదిలి , ఎక్కడో చెన్నై లోని కోయింబత్తూరు లో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏంటి అనే అనుమానం అందరిలో నెలకొంది.

అయితే అందుకు ఒక కారణం ఉందట. గంగా హాస్పిటల్స్ కి ఆర్థోపెడిక్స్ , హ్యాండ్ & మైక్రో సర్జరీ లో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది అట. సౌత్ ఇండియా లోనే ది బెస్ట్ ఆర్థోపెడిషియన్ రాజశేఖరన్ ఈ సర్జరీ చేశారట. రాజశేఖరన్ మామూలోడు కాదు, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ద్వారా టాప్ 1 సైంటిస్టుల్లో ఒకరిగా ఆయన గుర్తించబడ్డారట. అలాంటి స్పెషాలిటీ ఉన్న డాక్టర్ ఉన్నాడు కాబట్టే , రామ్ చరణ్ ప్రత్యేకించి ఇక్కడే ఆపేరేషన్ చేయించడానికి పట్టుబట్టారట. గతం లో మెగాస్టార్ చిరంజీవి భుజానికి కూడా సర్జరీ చేసింది ఈయనేనట. ఇలా చిరంజీవి కుటుంబానికి అత్యంత దగ్గరయ్యాడు రాజశేఖరన్ . అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కూడా తన కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నారు. కానీ ఆయనకు సర్జరీ చేసింది రాజశేఖరన్ కాదు , ముంబై కి చెందిన స్పెషలిస్టులు చేశారు.

మరి పవన్ కళ్యాణ్ కి కూడా రాజశేఖరన్ చేతనే సర్జరీ చేయించొచ్చు కదా ?, ముంబై కి ఎందుకు వెళ్లారు?, చిరంజీవి , రామ్ చరణ్ సూచించలేదా?, ఒకవేళ సూచించినప్పటికీ పవన్ కళ్యాణ్ ముంబై లోనే సర్జరీ చేయించుకోవడానికి మొగ్గుకి చూపారా? అంటూ సోషల్ మీడియా లో చర్చలు నడుస్తున్నాయి. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే , ఆయన తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ తో చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. షూటింగ్ మొదలయ్యే లోపు రామ్ చరణ్ పూర్తిగా కోలుకుంటారని అంటున్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , దసరా కానుకగా ఈ చిత్రం విడుదల అవ్వబోతుందట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper