The Paradise: నాని హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది. కెరియర్ మొదట్లో లవ్ స్టోరీస్ ను చేసిన నాని ఆ తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ ను డీల్ చేశాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వస్తుంది. ఇక అలాంటి క్రమంలోనే నాని లాంటి హీరో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో చేసిన ‘దసరా’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక అదే బాటలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ప్యారడైజ్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపద్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద పెట్టిన బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందట. దాంతో నాని ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
నాని తీసుకునే రెమ్యూనరేషన్ ను పూర్తిగా తిరిగి వెనక్కి ఇచ్చేసారట. సినిమా బడ్జెట్ లో దీనిని ఇన్వాల్వ్ చేయమని సినిమా సక్సెస్ అయితే అప్పుడు తనకు పర్సంటేజ్ రూపంలో కొంత డబ్బులను తీసుకుంటారనని చెప్పారట. ఇక మొత్తానికైతే ప్రొడ్యూసర్ మీద అదనపు భారం పడకుండా ఉండడానికి నాని ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడని ప్రతి ఒక్కరు నాని ని పొగుడుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా నాని కూడా కొన్ని చిన్న సినిమాలను నిర్మించాడు. కాబట్టి నిర్మాతలకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో అతనికి చాలావరకు అర్థమయ్యాయి. అందువల్లే ప్రొడ్యూసర్స్ కి పెరుగుతున్న బడ్జెట్ అదనపు భారం కాకూడదనే ఉద్దశ్యంతోనే ఆయన తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ఇక ఏదేమైనా కూడా హీరో తన రెమ్యూనరేషన్ ఇవ్వడం వల్ల సినిమా మీద కొంతవరకు భారమైతే తగ్గిందట. ఇక ప్యారడైజ్ సినిమా ఈ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందో తెలియాలంటే మాత్రం మరొక నెల రోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను దక్కించుకుంటుందనేది…