The Paradise: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. సంవత్సరన్నర క్రితం ఈ సినిమా నుంచి వచ్చినా గ్లింప్స్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబట్టింది. ముఖ్యంగా సినిమా యొక్క థీమ్ ని తెలుపుతు వదిలిన గ్లింప్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. సినిమా మీద అంచనాలు తార స్థాయి కి వెళ్ళిపోయాయి. ఇక రీసెంట్ గా సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అద్భుతంగా ఉన్నప్పటికి గ్లింప్స్ తో పోలిస్తే మాత్రం కొంతవరకు తగ్గిందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. రూరల్ ఏరియాలో ఈ టీజర్ కి సైతం భారీ స్పందన వస్తుంది. ఇలాంటి క్రమంలోనే గ్లింప్స్ తో పోలిస్తే ఈ టీజర్ కొంతవరకు తగ్గింది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి కావాలనే ఈ సినిమా మీద హైప్ ని తగ్గించడానికి ఇలాంటి ఒక టీజర్ ని కట్ చేశారని ఇప్పటికే సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎలాగైనా సరే ఆ అంచనాలను తగ్గించాలి లేకపోతే సినిమా ఎంత గొప్ప ఉన్న కూడా వాళ్ల అంచనాల అందుకోలేదనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు శ్రీకాంత్ ఈ టీజర్ ను కొంచెం డల్ అయ్యే విధంగానే కట్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ట్రైలర్లో తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారట. అలాగే సెప్టెంబర్ 24వ తేదీన ఈ సినిమా రాబోతుంది అంటూ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. మొత్తానికైతే ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది. శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు టాప్ రేంజ్ కి వెళ్తాడా? నానికి భారీ విజయం దక్కుతుందా?
పాన్ ఇండియాలో నాని స్టార్ హీరోగా ఎదుగుతాడా? టైర్ వన్ హీరోల్లో తను కూడా ఒకడిగా పేరు సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే ప్రతి ప్రేక్షకుడు కూడా ప్యారడైజ్ రిలీజ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు…