The Paradise: నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక స్టార్ హీరో సినిమాకు ఎలాంటి హైప్ ఉంటుందో , ఈ చిత్రానికి అంతకు మించిన హైప్ ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా కచ్చితంగా మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతుందనే బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ విశ్లేషకులు. అనేక వాయిదాల తర్వాత సెప్టెంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని నిన్న సాయంతం విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ కి ఆశించిన స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు అనే చెప్పాలి. టీజర్ లోని విజువల్స్ బాగానే ఉన్నప్పటికీ , ఎక్కడో ఎదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది.
మొదటి గ్లింప్స్ వీడియో వచ్చినప్పుడు ఆడియన్స్ లో కలిగిన ‘వావ్’ ఫీలింగ్ టీజర్ ని చూసినప్పుడు కలగలేదు. ముఖ్యంగా అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగా లేదని , నాని పలికే డైలాగ్స్ అసలు అర్థం కాలేదని , ఇలా రకరకాల కామెంట్స్ సోషల్ మీడియా లో వినిపించాయి. వీటిని బాగా పరిశీలించిన మేకర్స్ , ట్రోలర్స్ తమదైన శైలిలో కౌంటర్ ఇస్తూ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ‘జడల్స్ వార్ క్రై’ అనే క్యాప్షన్ ని పెట్టి , టీజర్ లో వినిపించిన డైలాగ్స్ అర్థం కాలేదు అన్నవాళ్లకు , ప్రతీ పదాన్ని వివరిస్తూ ఒక ట్వీట్ వేశారు. ఇది సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కనీసం తెలుగు కూడా అర్థం అవ్వని వాళ్లకు , టీజర్ లో వినిపించిన డైలాగ్స్ ని రాసి మీకు చూపిస్తున్నాము అనే విధంగా ఈ ట్వీట్ ని నెటిజెన్స్ అర్థం చేసుకున్నారు.
మరోపక్క ఈ సినిమాకు ఆడియన్స్ లో విపరీతమైన హైప్ ఉండడంతో టీజర్ కి యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ వస్తున్నాయి. కేవలం 19 గంటల్లోనే ఈ టీజర్ కి 10 మిలియన్ వ్యూస్ , 4 లక్షల లైక్స్ వచ్చాయి. చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ లైక్స్ గతం లో రాలేదు. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే , నాని ఇకపై మీడియం రేంజ్ హీరో కాదు , స్టార్ హీరో అని. ప్రస్తుతానికి టాలీవుడ్ 6 మంది స్టార్ హీరోలు ఉన్నారు , ఇప్పుడు నాని రూపం లో 7 వ స్టార్ హీరో పుట్టుకొచ్చాడు. రాబోయే రోజుల్లో ఈయన కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
JADAL’S WAR CRY #TheParadiseTeaser out now!
▶️ https://t.co/kRerrSeIiq#THEPARADISE GRAND RELEASE WORLDWIDE ON 24.09.26. pic.twitter.com/n0VaoQAO5W— THE PARADISE (@TheParadiseOffl) August 6, 2026