Shanmukh Jaswanth: యూట్యూబ్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే మన అందరికీ టక్కుమని గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటి షణ్ముఖ్ జస్వంత్. ‘వైవా’ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా బాగా ఫేమస్ అయినటువంటి షణ్ముఖ్ జస్వంత్, ఆ తర్వాత అదే సంస్థ తో కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసాడు, వాటికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేవి. ఆ తర్వాత స్వయంగా తానొక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’, ‘సూర్య’, ‘స్టూడెంట్’ వంటి సూపర్ హిట్ షార్ట్ ఫిలిమ్స్ తో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అలా వచ్చిన ఫేమ్ తో ‘బిగ్ బాస్ 5’ లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆయన రన్నర్ గా నిలిచాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు టైటిల్ విన్ అయ్యేంత ఫ్యాన్ ఫాలోయింగ్ మొదటి నుండి ఉండేది.
కానీ మధ్య లో సిరి హన్మంత్ తో నడిపిన లవ్ ట్రాక్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు కోల్పోయాడు. ఫలితంగా టాప్ 2 స్థానం తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ షో తర్వాత షణ్ముఖ్ జస్వంత్ జీవితం లో జరిగిన కొన్ని సంఘటనలు బాధాకరమైనవే. బిగ్ బాస్ షో నుండి బయటకు రాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ , ఆయన ప్రేయసి దీప్తి సునైనా బ్రేకప్ చెప్పింది. ఈ బ్రేకప్ డిప్రెషన్ నుండి షణ్ముఖ్ కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ తర్వాత ఇతని సోదరుడి పై ఒక యువతి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ కేసు ఫైల్ చేయడం , దాంతో పోలీసులు షణ్ముఖ్ సోదరుడి కోసం రాగా, అనుకోకుండా అతని ఇంట్లో కొన్ని మాదకద్రవ్యాలకు సంబంధించినవి దొరకడం , షణ్ముఖ్ తనకు ఎలాంటి సంబంధం లేదంటూ బాధ తో అరుస్తూ మాట్లాడడం వంటి వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
అవన్నీ చూసిన తర్వాత ఆయన అభిమానులకు ఇలాంటి పరిస్థితులు పగోడికి కూడా రాకూడదు అని కోరుకున్నారు. అయితే షణ్ముఖ్ వీటి అన్నిటిని నుండి కోలుకొని కం బ్యాక్ ఇచ్చాడు. ‘లీలా వినోదం’ అనే ఈటీవీ విన్ మూవీ చేసాడు. ఇప్పుడు ‘ప్రేమకు నమస్కారం’ అనే థియేట్రికల్ మూవీ చేసాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతే కాకుండా రీసెంట్ గానే షణ్ముఖ్ జస్వంత్ వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఆమెతో చాలా సంతోషంగా ఉన్నాడు. రీసెంట్ గానే తన కుటుంబం తో కలిసి ఒక ఫంక్షన్ లో పాల్గొంటూ , ఆయన ఫేమస్ డైలాగ్ ‘అరేయ్ ఏంట్రా ఇది’ అని పలకడం వంటివి చూసిన ఫ్యాన్స్ , షణ్ముఖ్ జస్వంత్ జీవితం ఎట్టకేలకు ఇప్పుడు మారిపోయింది , చాలా సంతోషంగా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram