Naga Vamsi: ఒక సినిమా సక్సెస్ ని సాధించాలి అంటే ఆ సినిమా కి సంబంధించిన అన్ని క్రాఫ్ట్ ల వాళ్ళు వాళ్ళ పూర్తి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు సైతం భారీ విజయాలను సాధిస్తున్నాయి. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు కొంత మంది స్టార్ హీరోలు వాళ్ళు చేసే సినిమాలతో తెచ్చుకుంటున్నారు. ఇక సినిమా రిలీజైన వెంటనే మూడు రోజుల్లో ఇంత కలెక్ట్ చేసిందంటూ కొన్ని ఫిగర్స్ ను చెబుతూ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. దీనిమీద ప్రొడ్యూసర్ నాగ వంశీ స్పందిస్తూ అన్ని సినిమాల పోస్టర్ల వెనుక ఫేక్ కలెక్షన్స్ ఉంటాయని చెప్పాడు. అలాంటి ఫేక్ కలెక్షన్స్ వేయడానికి కారణం వాళ్ళ అభిమానుల్లో ఉత్సాహం నింపడానికి అలాంటి ఫేక్ పోస్టర్లను వేస్తూ ఉంటామని ఆయన చెప్పాడు.
ప్రతి ఒక్కరు పోస్టర్ల మీద వేసే కలెక్షన్స్ నిజం కాదని, ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్స్ కి ఎంతో కొంత యాడ్ చేసి వేస్తూ ఉంటారని మరి ఎక్కువ సంఖ్యలో కలపరుగాని కొంతవరకు కలిపి చెబుతూ ఉంటారని ఆయన చెప్పాడు. ఇక అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కూడా సినిమా వాళ్లు చెప్పే కలెక్షన్లు అన్నీ ఫేక్ అనే విషయం ముందుగానే తెలుసని ఆయన చెబుతుండటం విశేషం…
ప్రస్తుతం నాగవంశీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న చాలామంది హీరోల సినిమాలకు సైతం ఫేక్ పోస్టర్లను వేస్తారా అంటూ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏదేమైనా కూడా ఒక సినిమా బతకాలి అంటే మాత్రం ఆ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంటే భారీ వసూళ్లను రాబడుతుంది. లేకపోతే మాత్రం పూర్తిగా డీలా పడిపోయే ప్రమాదం ఉందని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…