Homeఎంటర్టైన్మెంట్The Paradise Movie: 'ది ప్యారడైజ్' మూవీ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందా...

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందా…

The Paradise Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నానికి చాలా మంచి గుర్తింపు ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చబెట్టాయి. ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నాని ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా భారీ విజయాన్ని సాధించింది. టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా హైప్ ని క్రియేట్ […]

The Paradise Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నానికి చాలా మంచి గుర్తింపు ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చబెట్టాయి. ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నాని ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా భారీ విజయాన్ని సాధించింది. టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా హైప్ ని క్రియేట్ చేయడంతో ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్లో ‘ది పారడైజ్’ అనే సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఆగస్టు 6వ తేదీన ఒక టీజర్ అయితే రాబోతుంది.

కొద్దిసేపటి క్రితమే టీజర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో నాని నిలబడి ఉంటే తన నీడ రెక్కలు విచ్చుకున్న ఒక కాకి రూపం లో కనిపిస్తుంది. అంటే అణిచివేతకు గురైన నాని కొంతమంది దగ్గర నుంచి స్వేచ్ఛను కోరుకుంటూ తను వాళ్ళందర్నీ చంపేసైనా తనకు కావలసిన స్వేచ్ఛను తను పొందాలనుకునే పాత్రలో మనకు కనిపించబోతున్నాడు.

ఇక అదే విషయాన్ని దర్శకుడు ఈ పోస్టర్ లో సింబాలిగ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో నాని మరోసారి తన నట పొటెన్షియాలిటి ని బయటకు తీయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల సైతం ఈ సినిమాని రా అండ్ రస్టిక్గా తెరకెక్కిస్తున్నాడు. కాబట్టి మొత్తానికైతే ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్న విషయం క్లారిటీగా తెలుస్తుంది.

శ్రీకాంత్ ఓదెల ఇంతకు ముందు చేసిన దసరా సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. కాబట్టి ది పారడైజ్ సినిమా కూడా అలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసుకుంటుంది అంటూ సినిమా మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper