Anil Ravipudi: ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలతో సూపర్ హిట్ లను అందుకొని స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పటివరకు ఆయన 9 సినిమాలు చేస్తే 9 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి. ఇప్పుడు తను చేయబోతున్న పదోవ సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఆయన మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడం పక్క అంటూ అతని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. తొందరలోనే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి దర్శకులు ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా ఉన్నారు. కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదనే చెప్పాలి. ఆయన తన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు.
కమర్షియల్ సినిమాల బాటలోనే తన సినిమాలు ఉన్నప్పటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సినిమా ఇండస్ట్రీని ఎప్పటికప్పుడు లాభాల బాట పట్టిస్తున్నాడు. ముఖ్యంగా తనను నమ్ముకున్న నిర్మాతలను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లుగా మారుస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఇప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అలాగే తను కొన్ని రియల్టీ షో స్ కి సైతం గెస్ట్ గా కూడా అటెండ్ అవుతున్నాడు. అక్కడ కూడా భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట. ఒకరకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది స్టార్ హీరోల కంటే అనిల్ రావిపూడికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి అనిల్ రావిపూడి భారీ ఎత్తున రెండు చేతులతో సంపాదిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ల కంటే కూడా తను ఎక్కువగా సంపాదించడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలను సైతం బీట్ చేసే విధంగా అతని సంపాదన ఉందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…