Paradise teaser : నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. గత కొద్దిసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా చాలా రా అండ్ రస్టిక్ సన్నివేశాలతో ఉంది. నాని పూర్తిగా మాస్ మూడ్ లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ టీజర్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో కథ కూడా చాలా స్ట్రైయిట్ ఫార్వర్డ్ గా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కథ ఏంటి అంటే ఒక దొరకు వ్యతిరేకంగా కొంతమంది తిరుగుబాటు చేసి వాళ్లకు కావాల్సిన స్వేచ్ఛను వాళ్ళు ఎలా తెచ్చుకున్నారు వాళ్ల ఏరియాని వాళ్ళు ఎలా దక్కించుకున్నారు అనేది ఈ సినిమా కోర్ పాయింట్ గా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో టీజర్ ని కనుక మనం పూర్తిగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మెయిన్ విలన్ గా మోహన్ బాబు కనిపిస్తున్నాడు. అలాగే మాలిక్ అనే క్యారెక్టర్ లో తను ఒదిగిపోయినట్టుగా తెలుస్తుంది. తను యంగ్ గెటప్ లో ఉన్నప్పుడు కూడా లుక్స్ అయితే చాలా హైలెట్ గా ఉన్నాయి…ఇక నాని ఊర మాస్ క్యారెక్టర్ లో మరోసారి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయి. బోల్డ్ సన్నివేశాలు లేకపోయినా కూడా తో వైలెన్స్ తో కూడిన సన్నివేశాలకు పెద్దపీట వేస్తూ టీజర్ కట్ చేశారు. మొత్తానికైతే శ్రీకాంత్ ఓదెల ఆగస్టు 6 తేదీ 6 గంటలకు ఇండస్ట్రీ తగలడిపోతుందని ఎప్పుడైతే చెప్పాడో అప్పటినుంచి ఈ టీజర్ మీద అందరు భారీ ఆశాలైతే పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే పవర్ ప్యాక్డ్ గా టీజర్ ను దింపాడు. మొత్తానికైతే సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 24వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతుంది…
ఇక ఈ టీజర్ లో నాని చెప్పిన డైలాగులు సైతం చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి.
నాని అరుస్తూ వాళ్ళ బతుకులు మీద ఉమ్మేస్తూ మనం ఇప్పటికైనా మారకపోతే మనం ఎందుకు అనే మోటివేషన్ ఇస్తూ తన వర్గం వాళ్ళకి చెప్పిన డైలాగులు సైతం ప్రేక్షకుడిలో ఒక ఇంపాక్ట్ ను క్రియేట్ చేసే విధంగానే ఉన్నాయి.
నాని నెల ఎవరిది దేశం ఎవరిది అంటూ చెప్పిన డైలాగులు కూడా బాగున్నాయి. ఫైనల్ గా నాని బ్లేడ్లలను చేయికి కట్టుకొని రక్తాన్ని చిందిస్తూ దిష్టి తీసేటప్పుడు చెప్పిన డైలాగులు కూడా ఆధ్యాంతం ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నాయి. టీజర్ లో అన్ని పర్ఫెక్ట్ గా కుదిరినప్పటికీ నాని ఫాస్ట్ ఫాస్ట్ గా డైలాగులు చెప్పడమే ఎక్కడ తేడా కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఆ డైలాగ్ డెలివరీ పెర్ఫెక్ట్ గా లేదేమో అనిపిస్తుంది.
మొత్తానికైతే సంవత్సరం క్రితం వచ్చిన గ్లింప్స్ ఇచ్చిన ఇంపాక్ట్ ఈ రోజర్ ఇవ్వలేదు అనే ఫీల్ కలుగుతుంది. కారణం ఏదైనా కూడా మూవీ మీద అంచనాలను కొంచెం తగ్గించడానికి ఈ టీజర్ ని కొంచెం తక్కువ చేసి చూపించారనే విషయం అర్థమవుతుంది. ఇక ట్రైలర్లో పూర్తి విశ్వరూపాన్ని చూపించడానికి శ్రీకాంత్ ఓదెల రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది…