Shankar Shanmugham: సౌత్ ఇండియా లో లెజండరీ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో శంకర్ పేరు కచ్చితంగా ఉంటుంది. నేటి తరం ఆడియన్స్ కి పాన్ ఇండియా సినిమా అంటే రొటీన్ అయిపోయింది. కానీ ఆ రోజుల్లో పాన్ ఇండియా సినిమా కి కేర్ ఆఫ్ అడ్రస్ శంకర్ మాత్రమే. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాడు. ఒక్కటా, రెండా ఆరోజుల్లోనే వందల కొట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన హిస్టరీ శంకర్ కి మాత్రమే ఉంది. రాజమౌళి కూడా అనేక సందర్భాల్లో శంకర్ గారు నాకు ఆదర్శం అని చెప్పుకొచ్చేవాడు. ఆయన తర్వాత సౌత్ లో ఇంచుమించుగా అదే రేంజ్ బ్రాండ్ ని సొంతం చేసుకున్న మరో డైరెక్టర్ AR మురుగదాస్. ‘గజినీ‘ చిత్రం తో ఈయన ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు.
రాజమౌళి కంటే ముందుగా పాన్ ఇండియన్ మార్కెట్ ని చూసినటువంటి డైరెక్టర్స్ వీళ్లిద్దరు. అలాంటి లెజండరీ డైరెక్టర్స్ ఇప్పుడు సరైన హిట్ లేక డీలా పడ్డారు. ఈమధ్య కాలం లో వీళ్లిద్దరి నుండి విడుదలైన ప్రతీ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. వీళ్ళు కం బ్యాక్ ఇస్తే చూడాలని ఎంతో మంది ఆశ. కానీ ఆ కం బ్యాక్ ఇప్పుడు దాదాపుగా అసాధ్యమే అని అనుకుంటున్న సమయంలో వీళ్లిద్దరు ఇప్పుడు చేతులు కలపబోతున్నారు. మురుగదాస్ రాసిన స్క్రిప్ట్ కి , శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదే ఇప్పుడు తమిళం లో హాట్ టాపిక్ గా మారిన అంశం. శంకర్ వద్ద ఆస్థాన రైటర్ సుజాత అని ఒకరు ఉండేవారు. సుజాత చనిపోయినప్పటి నుండి శంకర్ కి కష్టకాలం మొదలైంది.
ఆయన అద్భుతంగా దర్శకత్వం వహించగలడు కానీ, స్క్రిప్ట్ రైటింగ్ చేయలేదు అనే విషయం ఆడియన్స్ కి తెలిసిపోయింది. అందుకే శంకర్ ఇప్పుడు స్క్రిప్ట్ కోసం మురుగదాస్ ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరో గా ధనుష్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి శంకర్ తన తదుపరి చిత్రం ‘వేలప్పిరి‘ నవల ని వెండితెర పై తెరకెక్కించాలని అనుకున్నాడు. అందుకు బడ్జెట్ భారీగా అవుతుంది. ప్రస్తుతం శంకర్ ఫార్మ్ ని నమ్మి అంత బడ్జెట్ పెట్టేవాళ్ళు లేకపోవడం తో, ఈ సింపుల్ ప్రాజెక్ట్ ని లాక్ చేసినట్టు సమాచారం. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్లబోతుందో చూడాలి.