Irumudi Movie: ఎక్కడ చూసిన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రవితేజ ‘ఇరుముడి‘ మేనియా నే కనిపిస్తోంది. ఈమధ్య కాలం లో ఏ పాన్ ఇండియన్ హీరో కి కూడా సాధ్యం అవ్వని రికార్డ్స్ ని మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాకు క్రియేట్ చేస్తున్నాడు. అనకాపల్లి నుండి అమెరికా వరకు కుంభస్థలం బద్దలయ్యే రేంజ్ వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అవుతున్నాయి. నేడు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 26 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఈమధ్య కాలం లో కొంతమంది స్టార్ హీరోలకు రెండవ వీకెండ్ లో కూడా సాధ్యం అవ్వని రికార్డు ఇది. ఇలా రవితేజ తన ఆరేళ్ళ బాక్స్ ఆఫీస్ ఆకలి ని తీర్చుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన సృష్టించిన ఈ వసూళ్ల సునామీ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
ఇకపోతే ఈ చిత్రం ద్వారా ఎంతో మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. వారిలో ఒకరు స్వశికా. ఇందులో ఆమె టీచరమ్మ గా ఎంత అద్భుతంగా నటించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. క్రూరమైన విలన్ క్యారెక్టర్ లో కనిపించిన ఈమెని, సినిమాలో చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు ఈమెని చంపేయాలి అనేంత కోపం రప్పించే రేంజ్ లో నటించింది. చూసేందుకు చాలా అందంగా , హాట్ గా ఉంది, గతంలో ఈమె హీరోయిన్ గా నటించిందా ? అని మన తెలుగు యువత ఈమె గురించి గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. అలా వెతకగా ఈమె గురించి అనేక విషయాలు బయట పడ్డాయి. ఈమె గతం లో మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అంతే కాదు ఈమె తెలుగు లో కూడా ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పేరు నువ్వే. సాయి క్రిష్ హీరో గా నటించిన ఈ సినిమా, 2012 లో విడుదలైంది.
ఆ తర్వాత దాదాపుగా 13 ఏళ్ళ పాటు ఈమె తెలుగు లో మరో సినిమాలో నటించలేదు. ఈమె ‘ఇరుముడి‘ కంటే ముందు నితిన్ ‘తమ్ముడు‘ చిత్రం లో నటించింది. అందులో కూడా ఈమె విలన్ క్యారెక్టర్ చేసింది. సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈమె హైలైట్ అవ్వలేదు. అదే విధంగా ‘శంబాలా‘ చిత్రం లో కూడా విలన్ గా నటించింది. ఇలా తెలుగు లో ఈమె హీరోయిన్ గా సక్సెస్ ని అందుకోలేకపోయినప్పయికీ , విలన్ గా దూసుకెళ్తుంది. ఇప్పుడు ‘ఇరుముడి‘ హిట్ తో ఈమె సౌత్ లోనే మోస్ట్ క్రేజీ లేడీ విలన్ గా మారిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.