Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీ ని చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్ల నుండి ఏ సినిమాకు చూడనంత జనాలను ఈ సినిమాకు థియేటర్స్ వద్ద చూస్తున్నామని , ఇరుముడి చిత్రం తో టాలీవుడ్ ట్రేడ్ పండితుల్లో సినిమాల పట్ల ఈమధ్య కాలం లో అపోహలు మొత్తం తొలగిపోయాయని అంటున్నారు. ఇకపోతే మూడవ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 11 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయట. ఈ ఏడాది మొదటి ఆదివారం అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా ‘పెద్ది’ చిత్రం ఖాతాలో నిన్నటి మొన్నటి వరకు ఒక రికార్డు ఉండేది. ఆ చిత్రానికి మొదటి ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో 9 లక్షల 47 వేల టికెట్లు అమ్ముడుపోయాయి అట.
ఇప్పుడు ఆ రికార్డు ని ‘ఇరుముడి’ చిత్రం అవలీలగా దాటేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి నమోదైన వసూళ్ల విషయానికి వస్తే, నైజాం ప్రాంతం నుండి మూడు రోజుల్లో ఈ చిత్రానికి 16 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. కేవలం మూడవ రోజున 6 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక సీడెడ్ లో అయితే ఈ చిత్రానికి మూడు రోజుల్లో 5 కోట్ల 7 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 3 కోట్ల 4 లక్షల రూపాయిలు , ఈస్ట్ గోదావరి నుండి 2 కోట్ల 56 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 50 లక్షలు, గుంటూరు నుండి 2 కోట్ల 44 లక్షలు , కృష్ణా నుండి 2 కోట్ల 6 లక్షల రూపాయిలు , నెల్లూరు నుండి 1 కోటి 12 లక్షల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తోంది.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 54 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 5 కోట్ల 80 లక్షలు , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 30 లక్షల రూపాయిలు వచ్చాయి. మొత్తం మీద మూడు రోజుల్లో ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 43 కోట్ల 17 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 75 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నేటితో ఈ చిత్రం కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ మార్కు కి అతి చేరువగా వెళ్లనుంది. ఊపు చూస్తుంటే ఈ సినిమా ఫుల్ రన్ లో 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.