Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ ఏ రేంజ్ లో ఉందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈమధ్య కాలం లో ఏ పాన్ ఇండియన్ సినిమాకు కూడా సాధ్యం అవ్వని అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పుతూ ఈ సినిమా ముందుకు దూసుకెళ్తుంది. సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి స్ట్రాంగ్ హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి అంటే, ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా రవితేజ కెరీర్ లో మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా నిలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే 100 కోట్ల గ్రాస్ కాదు , 100 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టే దిశగా ఈ సినిమా ముందుకెళ్తోంది.
అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇప్పటి వరకు ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేశారు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?. ముందుగా ఈ సినిమా స్టోరీ లైన్ ని మెగాస్టార్ చిరంజీవి కి వినిపించాడట డైరెక్టర్ శివ నిర్వాణ. చిరంజీవి కి నచ్చింది కానీ , కమిట్మెంట్స్ కారణంగా వెంటనే డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడడం తో , ఈ సినిమా ఆయన నుండి చేజారిపోయింది. ఇక ఈ సినిమాని మిస్ చేసుకున్న మరో టాప్ స్టార్ ఎవరో కాదు , సూర్య. ఈ సినిమాని తెలుగు , తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించాలని అనుకున్నారు. తమిళనాడు లో కార్తికేయ స్వామి ని పూజించే వాళ్ళు అత్యధిక శాతం ఉంటారు కాబట్టి , ఇటు తెలుగు , అటు తమిళం లో ఈ సినిమా వర్కౌట్ అవ్వుదని అనుకున్నారు. కానీ సూర్య కూడా డేట్స్ ఖాళీ లేకపోవడం తో ఈ చిత్రాన్ని మిస్ చేసుకోవాల్సి వచ్చింది.
అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఈ ప్రాజెక్ట్ చెయ్యాలని అనుకున్నారట. కానీ ఆయన ఇమేజ్ కి సూట్ అవ్వదేమో అని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇలా ఆ ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రవితేజ చేయడం, అది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలవడం జరిగింది. ఒకవేళ ఆ ముగ్గురు హీరోలు చేసుంటే ఎలా ఉండేది?, ఇంతకంటే ఎక్కువ వసూళ్లు వచ్చేవా?, లేదంటే రవితేజ తప్ప ఆ పాత్రకు ఎవ్వరూ న్యాయం చేయలేరని అనుకుంటున్నారా?, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.