Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: అల్లు అర్జున్ ని అవమానించిన చిరంజీవి.. ఆవేశం తో ఊగిపోతున్న ఫ్యాన్స్.

Allu Arjun: అల్లు అర్జున్ ని అవమానించిన చిరంజీవి.. ఆవేశం తో ఊగిపోతున్న ఫ్యాన్స్.

Allu Arjun: నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఎంత గ్రాండ్ గా జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక సోషల్ మీడియా ద్వారా అయితే సినీ సెలబ్రిటీలు మొత్తం మెగాస్టార్ చిరంజీవి తో తమకు ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ గురించి చెప్పుకుంటూ పోస్టులు వేశారు. అయితే అందరికంటే ముందు సెలబ్రిటీలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. నిన్న […]

Allu Arjun: నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఎంత గ్రాండ్ గా జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక సోషల్ మీడియా ద్వారా అయితే సినీ సెలబ్రిటీలు మొత్తం మెగాస్టార్ చిరంజీవి తో తమకు ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ గురించి చెప్పుకుంటూ పోస్టులు వేశారు. అయితే అందరికంటే ముందు సెలబ్రిటీలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. నిన్న పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తర్వాత , అభిమానులను ఎమోషనల్ అయ్యే విధంగా చేసింది అల్లు అర్జున్ సుభంక్షల ట్వీటే. అయితే చిరంజీవి అల్లు అర్జున్ కి సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదని, అందరికంటే చాలా ఆలస్యంగా రెస్పాన్స్ ఇచ్చాడని, ఎంతో ప్రేమతో శుభాకాంక్షలు తెలిపితే, ఇలాంటి రియాక్షన్ ఇవ్వడం కరెక్ట్ కాదని అంటున్నారు.

మరో పక్క పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ కి చిరంజీవి రెండు పేరాలు రాస్తూ , చాలా ఎమోషనల్ గా ధన్యవాదాలు తెలిపాడు. అంతే ఎమోషన్ ని క్రియేట్ చేసిన , అల్లు అర్జున్ ట్వీట్ కి మాత్రం ‘థాంక్యూ వెరీ ముచ్ బన్నీ’ అనే నాలుగు ముక్కలతో తేల్చేశాడు. ఇదే అల్లు అర్జున్ అభిమానులకు తీవ్రమైన ఆగ్రహాన్ని రప్పించేలా చేసింది. చిరంజీవి ని తిట్టడానికి బదులుగా , అల్లు అర్జున్ నే ట్యాగ్ చేసి ఆయన అభిమానులు పచ్చి బూతులు తిడుతున్నారు. అభిమానులు హీరోని పచ్చి బూతులు తిట్టడం బహుశా అల్లు అర్జున్ కి మాత్రమే జరిగింది అనుకుంటా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఈ అంశం పై యాంటీ ఫ్యాన్స్ కూడా ఒక రేంజ్ లో ట్రోల్స్ వేస్తున్నారు. నిన్న అల్లు అర్జున్ చిరంజీవి కి అలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగానే మెగా , అల్లు ఫ్యాన్స్ కలిసిపోయారు.

ఈ రెండు వర్గాల మధ్య సోషల్ మీడియా లో ఏ రేంజ్ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయో గత కొన్నేళ్ల నుండి గమనిస్తూనే ఉన్నాం. అంతా బాగుంది అనుకునేలోపు , రాత్రి సమయం లో ఇరు వర్గాల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. మరి ఈ గొడవ ఎప్పుడు చల్లారుతుందో చూడాలి. అయితే చిరంజీవి సోషల్ మీడియా అకౌంట్స్ ని చిరంజీవి వ్యక్తిగతంగా ఉపయోగించడం లేదని , సోషల్ మీడియా టీం ఉపయోగిస్తుందని, ఒకవేళ చిరంజీవి స్వయంగా ఆ ట్వీట్ చూసి రిప్లై ఇచ్చే పరిస్థితి ఉంటే అలా ఉండదని అంటున్నారు మెగా ఫ్యాన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper