Homeబిజినెస్Xiaomi Smart Band 11 సిరీస్‌ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ లైఫ్.. ఆపిల్ వాచ్...

Xiaomi Smart Band 11 సిరీస్‌ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ లైఫ్.. ఆపిల్ వాచ్ ను మించిన ఫీచర్లు.. కొనేయండి

Xiaomi Smart Band 11 : స్మార్ట్‌ వాచ్‌లు, ఫిట్‌నెస్‌ బ్యాండ్లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం షియోమీ (Xiaomi) కొత్త స్మార్ట్‌ బ్యాండ్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. Xiaomi Smart Band 11 Activeను ఎంపిక చేసిన గ్లోబల్‌ మార్కెట్లలో లాంచ్‌ చేయగా.. మరోవైపు Xiaomi Smart Band 11ను చైనాలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 7న చైనాలో ఈ కొత్త బ్యాండ్ అధికారికంగా విడుదల కానుంది. అదే రోజున Xiaomi 18 […]

Xiaomi Smart Band 11 : స్మార్ట్‌ వాచ్‌లు, ఫిట్‌నెస్‌ బ్యాండ్లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం షియోమీ (Xiaomi) కొత్త స్మార్ట్‌ బ్యాండ్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. Xiaomi Smart Band 11 Activeను ఎంపిక చేసిన గ్లోబల్‌ మార్కెట్లలో లాంచ్‌ చేయగా.. మరోవైపు Xiaomi Smart Band 11ను చైనాలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 7న చైనాలో ఈ కొత్త బ్యాండ్ అధికారికంగా విడుదల కానుంది. అదే రోజున Xiaomi 18 Fold కూడా మార్కెట్‌లోకి రానుంది.

షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 యాక్టివ్ ధర ఎంత?

షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 యాక్టివ్ ధరను 59.50 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.4,000)గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్‌, గ్రే, పొమెలో పింక్‌ కలర్‌ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఎంపిక చేసిన గ్లోబల్‌ మార్కెట్లలో షావోమీ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా విక్రయాలు జరగనున్నాయి.

ఈ బ్యాండ్‌లో 1.47 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. 172×320 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 247ppi పిక్సెల్‌ డెన్సిటీతో స్క్రీన్‌ అందించారు. రీన్‌ఫోర్స్‌డ్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఉండటంతో పాటు 100కు పైగా వాచ్‌ ఫేస్‌లను ఎంచుకునే అవకాశం ఉంది.

21 రోజుల వరకు బ్యాటరీ

షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 యాక్టివ్ లో TPU బ్యాండ్‌ను అందించారు. 135mm నుంచి 215mm వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. PPG సెన్సర్‌, యాక్సిలరోమీటర్‌, ERM మోటార్‌ వంటి హార్డ్‌వేర్‌ ఇందులో ఉన్నాయి. 5ATM వాటర్‌ రెసిస్టెన్స్‌ కూడా లభిస్తుంది. ముఖ్యంగా సాధారణ వినియోగంలో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 21 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

హెల్త్‌ ఫీచర్ల విషయానికి వస్తే హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌, స్లీప్‌ ట్రాకింగ్‌, SpO2 బ్లడ్‌ ఆక్సిజన్‌ మానిటరింగ్‌, స్ట్రెస్‌ మానిటరింగ్‌, మహిళల ఆరోగ్య నిర్వహణ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3ను అందించారు. ఆండ్రాయిడ్ 8 లేదా ఆ తర్వాతి వెర్షన్లు, iOS 14 లేదా ఆ తర్వాతి వెర్షన్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లతో ఈ బ్యాండ్‌ పనిచేస్తుంది. దీని బరువు సుమారు 18 గ్రాములు.

షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 ధర, వేరియంట్లు

ఇక షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 స్టాండర్డ్‌ మోడల్‌ ధర సుమారు రూ.4,000 నుంచి ప్రారంభమవుతుంది. NFC వేరియంట్‌ ధర సుమారు రూ.4,800 గా ఉంది. సిరామిక్ ఎడిషన్, పూర్తి లోహపు ఎడిషన్ మోడళ్ల ధరలు ఒక్కొక్కటి సుమారు రూ.5,600 గా నిర్ణయించారు. బ్లాక్‌, పింక్‌, పర్పుల్‌, ఎల్లో రంగుల్లో ఈ బ్యాండ్‌ లభిస్తుంది.

అమోలోడ్ డిస్‌ప్లే, 2,000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌

షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11లో 1.72 అంగుళాల అమోలోడ్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కేవలం 2mm మందం ఉన్న బెజెల్స్‌తో వచ్చే ఈ స్క్రీన్‌ గరిష్ఠంగా 2,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. బ్యాండ్‌ మందం 9.99mmగా ఉంది.

ఫిట్‌నెస్‌ పరంగా కూడా ఈ బ్యాండ్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. 150కి పైగా స్పోర్ట్స్‌ మోడ్‌లు, హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ ట్రాకింగ్‌, స్ట్రెస్‌ మానిటరింగ్‌, స్లీప్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. అలాగే 5ATM వాటర్‌ రెసిస్టెన్స్‌ సపోర్ట్‌ కూడా ఉంది.

ముఖ్యంగా 21 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ అందిస్తుందని షియోమీ పేర్కొంది. iOS డివైజ్‌లకు కూడా ఇది సపోర్ట్‌ చేయనుంది. మొత్తంగా చూస్తే తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌, మెరుగైన హెల్త్‌ ట్రాకింగ్‌ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 సిరీస్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper