Bigg Boss Telugu 10 ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కి ఎవ్వరూ ఊహించని రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. అందుకు కారణం గత సీజన్ పెద్ద హిట్ అవ్వడం తో పాటు, ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్. సెలబ్రిటీల్లో ఈసారి మంచి పాపులారిటీ ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇక ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా ఎంపికైన సామాన్యులు కూడా ఒక్కొక్కరు చాకులు లాగా ఉన్నారు. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ తో ‘బిగ్ బాస్ 10’ ని ప్రారంభించబోతున్నారు. ఒక్కొక్కరి బ్యాక్ గ్రౌండ్ వివరాలను తెలుసుకుందాం.
ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన కంటెస్టెంట్ పేరు ముకేశ్ గౌడ. ఈయన గతంలో స్టార్ మా ఛానల్ లో చేసిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ సంచలన విజయం సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ఆడియన్స్ కూడా ఈ సీరియల్ ని ఎగబడి చూశారు. ఆ కారణం చేత ముకేశ్ గౌడ కి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది, ముఖ్యంగా లేడీస్ ఈయనంటే పది చచ్చిపోతారు. ఇంతటి ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి రాబోతున్నాడు కాబట్టి , కచ్చితంగా ఈయనకు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఈయన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది.
ఇక మనం మాట్లాడుకోబోయే రెండవ కంటెస్టెంట్ పేరు దేబ్ జానీ మెదక్. ఈమెని గత సీజన్ లోనే తీసుకోవాలని అనుకున్నారు కానీ , చివరి నిమిషం లో కుదర్లేదు. స్టార్ మా ఛానల్ లో ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘సత్యభామ’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ ఈమె హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో ఈమె ఆడియన్స్ ని అలరించింది. ఈమెకు కూడా క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. బిగ్ బాస్ హిస్టరీ లోనే మొట్టమొదటి లేడీ కంటెస్టెంట్ గా నిలిచే అవకాశాలు ఈమెకు పుష్కలంగా ఉన్నాయి.
ఇక హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న మూడవ కంటెస్టెంట్ ఆటో రామ్ ప్రసాద్. ‘జబర్దస్త్’ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను అలరించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన బిగ్ బాస్ లోకి వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే ఆ స్థాయి ఎప్పుడో ఈయన దాటేశాడు, ఇప్పుడు వరుసగా సినిమాలు కూడా చేస్తున్నాడు. కానీ బిగ్ బాస్ ని experience చెయ్యాలని బలంగా అనుకున్నాడు, అందుకే అందరికంటే ముందుగా ఈ షో లో పాల్గొనడానికి సైన్ చేసాడు. ఇప్పటి వరకు ఆటో రామ్ ప్రసాద్ లో జనాలు కేవలం ఒక్క కోణం మాత్రమే చూశారు , ఇప్పుడు ఆయనలోని అనేక కోణాలను ఈ బిగ్ బాస్ హౌస్ లో చూడబోతున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఒక్క కమెడియన్ కూడా కప్పు కోట్లలేకపోయారు. ఆటో రామ్ ప్రసాద్ కి కప్పు కొట్టేంత కెపాసిటీ ఉంది. మరి ఆయన ఎంత వరకు ఆ దిశగా అడుగులు వేస్తాడో చూడాలి.
ఇక జబర్దస్త్ ఫ్యామిలీ నుండి ‘బిగ్ బాస్ 10’ లోకి రాబోతున్న మరో కంటెస్టెంట్ పొట్టి నరేష్. ఈయన ‘జబర్దస్త్’ తో పాటు ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షో లో కనిపిస్తూ ఉంటాడు. ‘బిగ్ బాస్’ మేకర్స్ గత రెండు సీజన్స్ లో ఈయన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేశారు కానీ, కుదర్లేదు. చూసేందుకు మనిషి ఇంతే ఉంటాడు కానీ, లోపల చాలా విషయం ఉంది. ఆడియన్స్ ఇతనిలో టాలెంట్ ని చూసి కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు , అందులో ఎలాంటి సందేహం లేదు.
ఇక ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న 5వ కంటెస్టెంట్ యాంకర్ వర్షిణి. ఈమె కూడా ఈటీవీ లో ఎన్నో సూపర్ హిట్ షోస్ కి హోస్ట్ గా వ్యవహరించింది. ముఖ్యంగా ‘ఢీ ‘ షో లో ఈమె సుడిగాలి సుధీర్ , ప్రదీప్ , హైపర్ ఆది , రష్మీ లతో కలిసి చేసిన సందడి ని అంత తేలికగా మర్చిపోలేం. మంచి కామెడీ టైమింగ్ కూడా ఈమెలో ఉంది. యూత్ ఆడియన్స్ లో ఈమెకు ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. గత నాలుగు సీజన్స్ నుండి ఈమెని అడుగుతున్నారు, కానీ ఎదో ఒక కారణం చేత ఆగిపోతూ వచ్చింది. కానీ ఈ సీజన్ లో మాత్రం ఆమె పాల్గొనడానికి అమితాసక్తిని చూపించారు. ఆటో రామ్ ప్రసాద్ తర్వాత ఈ షో లో పాల్గొనడానికి సంతకం చేసిన మొట్టమొదటి కంటెస్టెంట్ ఈమెనే. చూడాలి మరి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండబోతుంది అనేది.
ఇక ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న 6 వ కంటెస్టెంట్ టెంపర్ వంశీ. సినిమాల్లో విలన్ గా ఈయన ఎంత పాపులారిటీ ని సంపాదించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘టెంపర్’ చిత్రం తో బాగా ఫేమస్ అయిన ఈయన, ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్, కొరియన్ కనకరాజు వంటి చిత్రాల్లో కనిపించాడు. సినిమాల్లో విలన్ గా కనిపించిన ఈయన, నిజ జీవితం లో చాలా సున్నితమైన మనిషి అనే టాక్ ఉంది. టాస్కులు అద్భుతంగా ఆడగల కెపాసిటీ ఉంది. ఈయన బిగ్ బాస్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇక ఈ సీజన్ లోకి అడుగుపెట్టబోతున్న 7 వ కంటెస్టెంట్ కృష్ణుడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించిన ఈయన, ‘వినాయకుడు’ అనే చిత్రం లో హీరో గా నటించి మంచి సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా హీరో గా , సహాయనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ ఎందుకో ఈమధ్య కాలంలో ఈయనకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ‘బిగ్ బాస్ 10’ ద్వారా మరోసారి ఆడియన్స్ కి బాగా దగ్గరై , సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నాడు.
ఇక హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న 8 వ కంటెస్టెంట్ పేరు చైత్ర రాయ్. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన ఈమెకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండవ బిడ్డ కి కేవలం 5 నెలలు మాత్రమే. గత సీజన్ లో సంజన ఎలాగో , ఈమె కూడా అంతే. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంది.
ఇక ఈ సీజన్ లోకి అడుగుపెట్టబోతున్న 9 వ కంటెస్టెంట్ పేరు అదాన్ టాక్స్ సుధీర్. యూట్యూబ్ ని చూసేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరిది. ఎంతో మంది పాపులర్ రాజకీయ నాయకులూ, సినిమా స్టార్స్ ని ఈయన ఇంటర్వ్యూ చేసాడు. మంచి టాలెంట్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలా నెగ్గుకు రాగలడో చూడాలి.
ఇక హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న చివరి సెలబ్రిటీ కంటెస్టెంట్ అదిత్ ఈశ్వరన్. ఈయన పలు సినిమాల్లో హీరో గా నటించాడు. రీసెంట్ గా విడుదలైన సూపర్ హిట్ ‘చెన్నై లవ్ స్టోరీ’ లో సెకండ్ హీరో గా నటించి మంచి క్రేజ్ ని సంపాదించాడు. చూస్తుంటే మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్ లాగానే అనిపిస్తున్నాడు, మరి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక ఎలా నడుచుకుంటాడో చూడాలి మరి.
ఇక ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న సామాన్యుల జాబితా ని ఇప్పుడు మనం చూడబోతున్నాం.
ముందుగా ఈ షో నుండి హౌస్ లోకి గ్రాండ్ ఇవ్వబోతున్న కంటెస్టెంట్ రోహిత్. ‘అగ్ని పరీక్ష 2’ కి ముందు ఇతనికి ఇన్ స్టాగ్రామ్ లో పట్టుమని వెయ్యి ఫాలోవర్లు కూడా లేరు. కానీ ఇప్పుడు ఏకంగా 64 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా ఈయన ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. విపరీతమైన టాలెంట్ ఉన్న రోహిత్, బిగ్ బాస్ హౌస్ లో వ్యక్తిత్వం లో కూడా మంచి మార్కులు సంపాదిస్తే, అవలీలగా ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా నిలుస్తాడు.
ఇక హౌస్ లోకి అందరికంటే ముందుగా ఎంట్రీ సంపాదించుకున్న కంటెస్టెంట్ ఝాన్సీ. ఈమె ‘అగ్ని పరీక్ష 2’ ఫినాలే ఎపిసోడ్ లో టాస్కులు అద్భుతంగా ఆడి అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. అయితే ఈమెకు ‘అగ్ని పరీక్ష 2’ కి ముందే ఇన్ స్టాగ్రామ్ లో 8 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఈమెని సెలబ్రిటీ క్యాటగిరీలో తీసుకోవాలి కానీ , సామాన్యుల క్యాటగిరీలో తీసుకుంటున్నారేంటి అనే వాదన సోషల్ మీడియా లో గట్టిగా వినిపిస్తుంది. రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది కాబట్టి , ఈమెకు ఈ షో ద్వారా మంచి క్రేజ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
ఇక హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న మరో సామాన్యుడు అమన్ మసూద్. ఈయనకు ఆడియన్స్ ఓటింగ్ చాలా బలంగానే పడింది. మంచి ఎంటర్టైనర్ , కానీ టాస్కులు ఆడేటప్పుడు బాగా తడబడుతున్నాడు. ‘అగ్ని పరీక్ష 2’ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజున కూడా ఈయన చాలా ఫౌల్స్ ఆడాడు. అంతే కాకుండా ఇతని పై చాలా నెగెటివిటీ కూడా ఉంది. ఎందుకంటే గత సీజన్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల ఇతనికి క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం తో పాటు , స్కూల్స్ కి వెళ్లి క్యాంపైన్ చేయడం వంటివి ఈయనపై నెగెటివిటీ ని పెంచాయి. బిగ్ బాస్ టీం మ్యానేజ్మెంట్ కోటాలో ఇతన్ని బిగ్ బాస్ లోకి పంపుతున్నారు అనే టాక్ కూడా ఉంది. చూడాలి మరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎలా ఉండబోతున్నాడు అనేది.
ఇక సామాన్యుల క్యాటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాల్గవ కంటెస్టెంట్ షాలిని. ఈమెను టీఆర్ఫీ క్వీన్ అనొచ్చు. చూసేందుకు చాలా అందంగా ఉంటుంది, అంతే కాకుండా గొడవలు కూడా గట్టిగానే పెట్టుకుంటోంది. ‘అగ్ని పరీక్ష 2’ లో టాస్కులు కూడా రఫ్ఫాడించింది. అంతే కాకుండా అమన్ తో లవ్ ట్రాక్ కూడా నడిపింది. బిగ్ బాస్ హౌస్ లో ఎలా నడుచుకోబోతుందో చూడాలి.
ఇక ‘అగ్ని పరీక్ష 2’ లో ఆడిషన్స్ సమయం నుండే మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్ ఆర్జే చరణ్. ఆడిషన్స్ ద్వారా ఈయనకు ఒక్కారిగా 2 లక్షల ఫాలోవర్స్ ఇన్ స్టాగ్రామ్ లో వచ్చేసారు. కానీ ఆ తర్వాత టాస్కుల్లో ఈయన పెద్దగా షైన్ అవ్వలేదు. మంచి మాటకారి, బిగ్ బాస్ లో ఎలా సర్వైవ్ అవుతాడో చూడాలి.
ఇక ఆడియన్స్ ఓటింగ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న చివరి కామనార్ శ్రేష్టి వ్యాకరణం. ఈమెని కామనార్ అని అనలేము. ఎందుకంటే మోడలింగ్ రంగం లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. గతంలో అనేక బాలీవుడ్ షోస్ లో కూడా ఈమె కనిపించింది. షారుఖ్ ఖాన్ తో ఈమె చేసిన చిట్ చాట్ వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అంతే కాదు ఈమె ‘అగ్ని పరీక్ష 2’ జడ్జీలలో ఒకరైన నవదీప్ వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ కి ఫ్రెండ్ అనే టాక్ కూడా ఉంది. ‘అగ్ని పరీక్ష 2’ లో చాలా మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది, మరి బిగ్ బాస్ హౌస్ లో ఎలా నడుచుకుంటుందో చూడాలి.
ఇక ‘అగ్ని పరీక్ష’ జడ్జీల ఛాయస్ లో మరో ఇద్దరు కామానర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వారిలో ఒకరు రామకృష్ణ కాగా, మరొకరు అపూర్వ. రామకృష్ణ గత నాలుగు ఎపిసోడ్స్ లో బాగా షైన్ అయ్యాడు. టాస్కులు బాగా ఆడగలిగే సత్తా ఉంది, మనిషి కూడా చాలా మంచోడు అనిపించుకున్నాడు. ఇతనిది ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, బిగ్ బాస్ హౌస్ లో ఎలా నెగ్గుకురాగలడో చూడాలి. ఇక అపూర్వ విషయానికి వస్తే , ఈమె మంచి మాటకారి మాత్రమే కాదు , టాస్కులు కూడా బలంగా ఆడగలను అని నిరూపించుకుంది. అంతే కాకుండా , చాలా మంచి అమ్మాయి అనే పేరు కూడా ‘అగ్ని పరీక్ష 2’ తో సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఎలా నడుచుకుంటుందో చూడాలి.
ఇదేనండీ ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న 18 మంది కంటెస్టెంట్స్ లిస్ట్. వీరిలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి.