Homeఎంటర్టైన్మెంట్Hyper Aadi: అవును చిరంజీవి తొక్కేశాడు.. హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు..వైరల్ వీడియో

Hyper Aadi: అవును చిరంజీవి తొక్కేశాడు.. హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు..వైరల్ వీడియో

Hyper Aadi: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా , రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు , మరో పక్క గ్రాండ్ గా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసిన చిరంజీవి కి సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. సినీ సెలబ్రిటీలు ఆయన తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయిపోతున్నారు. ఇకపోతే నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక […]

Hyper Aadi: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా , రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు , మరో పక్క గ్రాండ్ గా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసిన చిరంజీవి కి సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. సినీ సెలబ్రిటీలు ఆయన తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయిపోతున్నారు. ఇకపోతే నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ కి సినీ ప్రముఖులంతా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్ లో హైపర్ ఆది సోషల్ మీడియా లో గత 30 రోజుల నుండి మెగాస్టార్ చిరంజీవి పై జరుగుతున్న టార్గెట్టెడ్ ట్రోల్స్ కి బలమైన కౌంటర్ ఇచ్చాడు. ఆయన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైల్డ్ ఫైర్ లాగా మారిపోయింది.

హైపర్ ఆది మాట్లాడుతూ ‘గత వారం రోజుల నుండి ఇన్ స్టాగ్రామ్ లో చిరంజీవి కొంతమందిని తొక్కేశాడు అంటూ తప్పుడు కంటెంట్ ని వైరల్ చేస్తూ ఉన్నారు. అవును, చిరంజీవి నిజంగానే తొక్కేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ 1 గా ఎవ్వరూ కొనసాగలేరు అనే అహంకారాన్ని తొక్కేసి 30 ఏళ్ళు నెంబర్ 1 స్థానం లో కూర్చిని చిత్ర పరిశ్రమ ని ఏలారు. అప్పట్లో భారీ కలెక్షన్స్ బాలీవుడ్ నుండి వచ్చేవి. కేవలం బాలీవుడ్ లోనే ఆ స్థాయి వసూళ్లు వస్తాయి , మన టాలీవుడ్ కి కష్టం అనుకునేవాళ్లు. ఆ ఊహని కూడా తొక్కేసాడు. డ్యాన్స్ అంటే కేవలం నడవడం , అమ్మాయి చుట్టూ తిరగడం అనే భ్రమ ని కూడా తొక్కేసాడు. హీరోలు కేవలం డబ్బులు సంపాదించుకుంటారు, అభిమానులను , జనాలను పట్టించుకోరు అనే అనుకునే తప్పుడు మైండ్ సెట్ ని కూడా తొక్కేసాడు’.

‘త్రండ్రి సక్సెస్ అయితే కొడుకు కెరీర్ సాగడం కష్టం అని అందరూ అనుకునేవారు. ఆ ఆలోచనలను కూడా తొక్కేసి , తండ్రిని మించిన కొడుకుని ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి అందించాడు’ అంటూ హైపర్ ఆది మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆయన చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు ఎంత పెద్ద ఫ్యాన్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాళ్ళ పేరు తీస్తే పూనకాలు వచ్చి ఊగిపోతూ ఉంటాడు హైపర్ ఆది. నిన్న మరోసారి ఆయనలో అగ్నిపర్వతం బద్దలైంది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper