Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడు లేని విధంగా షో మొదలైన నాలుగు రోజులకే ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఈ ఎలిమినేషన్ నిజాయితీగా , ఆడియన్స్ ఓటింగ్ ద్వారా జరిగి ఉండుంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు , కానీ హౌస్ మేట్స్ ఓటింగ్ తో జరిగింది, అదే అసలు సమస్య. ఒక్క ఎలిమినేషన్ అంటే పర్వాలేదు అనుకోవచ్చు, ఏకంగా మొదటి వారం రెండు ఎలిమినేషన్స్ హౌస్ మేట్స్ ఓట్లతో జరిగింది. ముందుగా చరణ్ ఎలిమినేట్ అవ్వగా , ఆ తర్వాత చైత్ర ఎలిమినేట్ అయ్యింది. నేటి ఎపిసోడ్ లో మనం ఈ ఎలిమినేషన్ ని చూడొచ్చు. హై రిస్క్ జోన్ లోకి వర్షిణి , చైత్ర , సుధీర్ , అమన్ వస్తారు.
వీరిలో అత్యధిక శాతం ఓట్లు చైత్ర కి రావడం తో ఆమె షో నుండి ఎలిమినేట్ అయ్యింది. అయితే వీళ్ళు కేవలం హౌస్ మేట్స్ దృష్టిలో మాత్రమే ఎలిమినేట్ అయ్యినట్టు . షో నుండి పూర్తిగా ఎలిమినేట్ అయ్యినట్టు కాదట. రేపటి ఎపిసోడ్ లో అక్కినేని నాగార్జున వీళ్ళిద్దరిని హౌస్ లోకి పంపించి ఒక టాస్క్ ని నిర్వహిస్తాడట. ఈ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో, వాళ్ళు ఈ హౌస్ లో ఉంటారట, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తారట . అందుకే వీళ్ళిద్దరిని ప్రస్తుతం బిగ్ బాస్ హాస్టల్ లో ఉంచారు , వీళ్ళు తమ ఇంటికి ఇంకా తిరిగి వెళ్ళలేదు. షో ఆసక్తికరంగా సాగడం కోసం , ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరి ఏమి జరగబోతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే చరణ్ కి టాస్క్ పెడితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం వీరికి మాత్రమే కాదు , హౌస్ లో శాశ్వత హౌస్ మేట్స్ కానీ ప్రతీ ఒక్కరు రిస్క్ లో ఉన్నట్టే.
ఎదో ఒక రోజు హై రిస్క్ జోన్ లోకి వచ్చి , ఇలా ఎలిమినేషన్ వరకు రావొచ్చు. ఇప్పటి వరకు అయితే రోహిత్ , రామ్ ప్రసాద్ , వంశీ వంటి వారు శాశ్వత హౌస్ మేట్స్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఎవరెవరు శాశ్వత హౌస్ మేట్స్ అవుతారో చూడాలి. మరో ఆసక్తికరమైన విషయ ఏమిటంటే , ఈ సీజన్ లో కేవలం ఒక్క సీక్రెట్ రూమ్ మాత్రమే కాదు , ఏకంగా మూడు సీక్రెట్ రూమ్స్ ఉంటాయట. త్వరలోనే వీటిని రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.