Homeఎంటర్టైన్మెంట్Star Maa: 'స్టార్ మా' ఛానల్ లో ఇకపై కొత్త సినిమాలు టెలికాస్ట్ అవ్వడం కష్టమేనా...

Star Maa: ‘స్టార్ మా’ ఛానల్ లో ఇకపై కొత్త సినిమాలు టెలికాస్ట్ అవ్వడం కష్టమేనా .. ?

Star Maa: స్టార్ మా ఛానల్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకపక్క కామెడీ షోస్ తో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ ఛానల్, మరోపక్క బ్లాక్ బస్టర్ టీవీ సీరియల్స్ తో తిరుగులేని స్థాయిలో ముందుకెళ్తోంది. వీటితో పాటు , కొత్తగా విడుదలయ్యే సినిమాలను కొనుగోలు చేయడం లో స్టార్ మా ఛానల్ ఎప్పుడూ ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి […]

Star Maa: స్టార్ మా ఛానల్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకపక్క కామెడీ షోస్ తో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ ఛానల్, మరోపక్క బ్లాక్ బస్టర్ టీవీ సీరియల్స్ తో తిరుగులేని స్థాయిలో ముందుకెళ్తోంది. వీటితో పాటు , కొత్తగా విడుదలయ్యే సినిమాలను కొనుగోలు చేయడం లో స్టార్ మా ఛానల్ ఎప్పుడూ ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమాలు స్టార్ మా ఛానల్ లో ఉన్నాయి. ఆదివారం అయ్యిందంటే చాలు, ఎదో ఒక కొత్త సినిమాని టెలికాస్ట్ చేస్తూ ఉంటుంది స్టార్ మా ఛానల్. అయితే ఇకపై ఆదివారం కొత్త సినిమాలను టెలికాస్ట్ చేయకూడదు అని స్టార్ మా ఛానల్ యాజమాన్యం కఠినమైన నిర్ణయం తీసుకుంది.

ఒకప్పుడు టీవీ సీరియల్స్ సోమవారం నుండి శుక్రవారం వరకు టెలికాస్ట్ అయ్యేవి , ఆ తర్వాత శనివారం కూడా టెలికాస్ట్ అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు స్టార్ మా ఛానల్ ఆదివారం రోజున కూడా టీవీ సీరియల్స్ ని టెలికాస్ట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యింది. ఇకపై సోమవారం నుండి ఆదివారం వరకు నాన్ స్టాప్ గా సీరియల్స్ ప్రసారం కానుంది. ఇంతకు ముందు ప్రతీ ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకు ఎదో ఒక కొత్త సినిమాని టెలికాస్ట్ చేసేవారు. కానీ ఇకపై వాటి స్థానం లో సీరియల్స్ టెలికాస్ట్ కానుంది. ఎందుకు అకస్మాత్తుగా స్టార్ మా ఛానల్ ఇలాంటి నిర్ణయం తీసుకుందో చాలా మందికి అర్థం కావడం లేదు. సినిమాల కంటే సీరియల్స్ కి అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ రావడమే అందుకు ముఖ్య కారణమని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఈమధ్య కాలం లో ప్రసారం అవుతున్న సినిమాలకు పెద్దగా టీఆర్ఫీ రేటింగ్స్ రావడం లేదట.

ఒకప్పుడు కొత్త సినిమాలకు టీఆర్ఫీ రేటింగ్స్ 15 కి పైగా వచ్చేవి. 28 , 23 రేటింగ్స్ వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్త సినిమాలకు కనీసం 5 టీఆర్ఫీ రేటింగ్స్ రావడమే గగనం అయిపోయింది. కానీ సాయంత్రం నుండి టెలికాస్ట్ ప్రతీ సీరియల్ కి , ఒక్కో ఎపిసోడ్ కి 8 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయట. అందుకే స్టార్ మా ఛానల్ సీరియల్స్ కి ఇంత పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 6 నుండి బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వబోతుంది. దీని టైమింగ్స్ ని స్టార్ మా టీం ఎలా ప్లాన్ చేసిందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper