Bigg Boss Agnipariksha 2: స్టార్ మా , జియో హాట్ స్టార్ లలో రీసెంట్ గానే మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ షో కి ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ప్రతిరోజు మనం సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. జడ్జీలు కంటెస్టెంట్స్ తో వ్యవహరించే తీరు ఆడియన్స్ కి నచ్చడం లేదు , ఎక్కువ శాతం వ్యతిరేకిస్తున్నారు , అయినప్పటికీ కూడా ఎపిసోడ్స్ మంచి రసవత్తరంగా ఉండడం తో వ్యూయర్ షిప్ చాలా గట్టిగానే వస్తోంది. నిన్నటితో ఆడిషన్స్ కి సంబంధించిన ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. నేటి ఎపిసోడ్స్ నుండి ఎంపికైన 18 మంది కంటెస్టెంట్స్ కి టాస్కులు నిర్వహించడం వంటివి చూడొచ్చు. ఇప్పటికే జియో హాట్ స్టార్ లో నేటి ఎపిసోడ్ ని అప్లోడ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి పెట్టిన టాస్కులు చూస్తే , అయ్యో పాపం అని అనిపించక తప్పదు.
ఇదంతా పక్కన పెడితే, నిన్న జరిగిన ‘అగ్నిపరీక్ష 2’ షూటింగ్ లో ‘బిగ్ బాస్ 7’ రన్నర్ అమర్ దీప్, ‘బిగ్ బాస్ 9’ రన్నర్ తనూజ, ‘బిగ్ బాస్ 5’ విన్నర్ వీజే సన్నీ, ప్రియాంక జైన్ వంటి వారు పాల్గొన్నారట. వీళ్ళు తమ సినిమాలు, కవర్ సాంగ్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారో , లేదంటే కంటెస్టెంట్స్ కి టాస్కులు నిర్వహించడానికి వచ్చారో , ప్రస్తుతానికి అయితే స్పష్టమైన సమాచారం లేదు. కానీ కళ్యాణ్ పడాల , డిమోన్ పవన్, దివ్య నికిత , మాస్క్ మ్యాన్ హరీష్, ప్రియా , మర్యాద మనీష్ వంటి వారు ఈ షో కి వచ్చి కంటెస్టెంట్స్ కి టాస్కులు నిర్వహించారట. ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన టాస్కుల్లో రోహిత్ నాయుడు రెండు స్టార్స్ ని సొంతం చేసుకొని మోస్ట్ విలువైన కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడట.
బిందు మాధవి ఇతనికి స్వీట్ ని తినిపించి , ముఖం పై నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. అదే బిందు మాధవి చేత సలాం కొట్టించుకొని స్టార్ ని సొంతం చేసుకున్నాడట రోహిత్ నాయుడు. అదే విధంగా శ్రేష్టి వ్యాకరణం, రాజకుమారి దయానా, హేమంత్ వంటి వారు సేఫ్ జోన్ లో ఉన్నారట. ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ షూటింగ్ లో నవరసాల మామ రామకృష్ణ , గాయత్రీ కి మధ్య ఒక టాస్క్ ని నిర్వహించారట. ఈ టాస్కులో రామకృష్ణ గెలిచి ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలను పదిలం చేసుకోగా , గాయత్రీ ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.