Srinivasa Mangapuram: మహేష్ బాబు వాళ్ళ అన్న కొడుకు అయిన జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమాని చూసిన చాలామంది సినిమా కథలో పెద్దగా డెప్త్ లేదని రొటీన్ రొట్ట ఫార్ములా కథను తీసుకొని సినిమా చేశారని చెబుతున్నారు. హీరో బాగా చేశాడని అతని పర్ఫామెన్స్ కి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఈరోజు మహేష్ బాబు ఈ సినిమా వీక్షించారట. ఈ సినిమాను చూసినా సూపర్ స్టార్ ఒక 30 నిమిషాల పాటు జయకృష్ణ తో పర్సనల్ గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. నటనలో చాలా వైవిధ్యాన్ని చూపించావు, చాలా మంచి నటన కనబరుస్తున్నావు అంటూ అతన్ని మెచ్చుకున్నాడట. ఇకమీదట కూడా వైవిద్య భరితమైన ఛాలెంజింగ్ రోల్స్ ని ఎంచుకొని సినిమాలు చేయాలని కూడా మహేష్ బాబు జయకృష్ణకి సలహాలు ఇచ్చారట.
మొత్తానికైతే డైరెక్టర్ అజయ్ భూపతి రొటీన్ ఫార్ములా లో సినిమాని చేయడం ఈ సినిమా మైనస్ అయింది. కథలో అసలు ఎక్కడ కూడా వైవిధ్యం లేకపోవడం రొటీన్ టెంప్లేట్ లోనే సినిమాలను నడపడం ఈ సినిమాకి భారీగా మైనస్ అయింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ లవ్ స్టోరీ లో అసలు ఎక్కడ మనకు ప్రేమ కనిపించదు.
ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కడ వర్కౌట్ కాలేదు. దాంతో సినిమా పూర్తిగా తేడా కొట్టేసింది. ఇక ఇదిలా ఉంటే జయ కృష్ణ మాత్రం చాలా మంచి నటనను కనబరిచి తనకు ఫ్యూచర్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. మహేష్ బాబు లాంటి నటుడు సైతం జయకృష్ణను పొగుడుతూ తనకు మంచి ఫ్యూచర్ ఉందని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట.
దాంతో ఇప్పుడు రెండో సినిమాకి కూడా జయకృష్ణ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. రెండో సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంలో ఇంకా క్లారిటి రాలేదు. కానీ ఇప్పటికే కొంతమంది దర్శకులు జయకృష్ణ కి కథను చెప్పడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…