Naga Shaurya: టాలీవుడ్ లో సాయి పల్లవి కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఈమె కోసం థియేటర్స్ కి క్యూలు కట్టే ఆడియన్స్ లక్షల మంది ఉన్నారు. ట్రేడ్ ఈమెకు ‘లేడీ పవర్ స్టార్’ అనే ట్యాగ్ కూడా ఇచ్చింది. ఈమె కనిపిస్తే చాలు అభిమానులు కేరింతలు, చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. హీరోలకు ఆ స్థాయి అభిమానులు ఉండడం చూసాము, కానీ ఒక హీరోయిన్ కి కూడా ఇలాంటి క్రేజ్ ఉంటుందా అని అనిపించేలా చేసిన ఏకైక హీరోయిన్ సాయి పల్లవి మాత్రమే. స్క్రీన్ పై ఈమె కనిపిస్తే చాలు , ఆమె పక్కన ఉన్న హీరో కూడా తేలిపోతాడు అని అందరూ అంటుంటారు. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి సాయి పల్లవి పై , ప్రముఖ యంగ్ హీరో నాగ శౌర్య చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారాయి.
ముందుగా యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘సాయి పల్లవి పక్కన ఏ హీరో ఉన్నా తేలిపోతారు అంటారు , నిజమేనా?’ అని అడగ్గా, అందుకు నాగ శౌర్య సమాధానం చెప్తూ ‘అలా ఏమి లేదే.. సాయి పల్లవి ఎంత చేసినా అవుట్ ఫోకస్ లోనే ఉంటుంది కానీ , ఫోకస్ లోకి రాదు. తనకు ఉన్న యాటిట్యూడ్ తో వచ్చిన సమస్య అది. ఆమెతో నాకు అనుభవం అయ్యింది కాబట్టి చెప్తున్నాను. తన ప్రవర్తన ఎలా ఉంటుందంటే నేనే చేస్తాను, నాకు ఇలాగే కావాలి అని డిమాండ్ చేస్తూ ఉంటుంది. నీ విషయం లో ఎలా చేసుకో , కానీ స్క్రిప్ట్ కి ఏది కావాలో అది ఇవ్వాలి కానీ , స్క్రిప్ట్ లాగేసుకొని నీ ఇష్టమొచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు. సాయి పల్లవి ఏమి మూవీ చేసిన సెట్స్ లో గొడవలు ఉంటాయి. నేను చేసిన సినిమాలో కూడా ఆమె గొడవలు పెట్టుకుంది. క్రమశిక్షణ ఉండదు , షూటింగ్ కి కూడా చాలా ఆలస్యం గా వస్తూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.
ఇకపోతే గతం లో నాగ శౌర్య , సాయి పల్లవి కలిసి ‘కణం’ అనే చిత్రం లో నటించారు. తెలుగు , తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా , భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే సాయి పల్లవి , నాగ శౌర్య కి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. ఇక వీళ్ళ కెరీర్స్ విషయానికి వస్తే సాయి పల్లవి పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ గా ఎదిగి దుమ్ము లేపుతుండగా, నాగ శౌర్య మాత్రం వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో మార్కెట్ మొత్తాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం ఈయన చేతుల్లో ఒక్క సినిమా కూడా లేదు.
Fake annollu idi chudandi https://t.co/2ycGXm1P3h pic.twitter.com/zgPBQyoxPs
— Nishwanth (@Nishwanth02) August 20, 2026