Crime News: తల్లిదండ్రులు ఎంత కష్టపడైనా సరే తమ పిల్లలకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు. తమ స్థాయికి మించయినా సరే అప్పులు చేసి.. పిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరుపుతారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత కొలువులు చేస్తున్న యువకులకు తమ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే దీనిని ఓ వ్యక్తి తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. తనకు లేని ఉద్యోగాన్ని సృష్టించుకుని.. మాయ మాటలు చెప్పాడు. చివరికి ఓ యువతి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రుల కలలను కల్లలు చేశాడు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఊచలు లెక్కబెడుతున్నాడు.
అతడి పేరు సందీప్ కుమార్.. డిగ్రీ వరకు చదివాడు. కానీ ఎదుటివారిని మోసం చేయడంలో పీహెచ్డీ చేశాడు. తాను కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యానని 2016లో ఓ పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఆ తర్వాత ఊరంతా సంబరాలు జరిపాడు. బంధువులకు మిఠాయిలు, ఇతర కానుకలు పంపించాడు. దీంతో వారంతా అతడు ఐఏఎస్ కు ఎంపికయ్యాడని అనుకున్నారు. ఇది క్రమంలో ఒక మ్యాట్రిమోనీ సైట్ లో తన వివరాలు ఉంచాడు. అతడి వివరాలు చూసిన ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అరెమిల్లి శ్రావణి.. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు అతడిని సంప్రదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాలు కూర్చుని మాట్లాడుకున్నాయి. అటు సందీప్, ఇటు శ్రావణి పెళ్లికి ఒకే చెప్పడంతో.. 2018లో ఘనంగా వారి పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో శ్రావణి కుటుంబ సభ్యులు అతనికి 50 లక్షల కట్నం, అరకిలో బంగారం, ఇతర లాంఛనాలు ఇచ్చారు.. పెళ్లయిన కొత్తలో శ్రావణి, సందీప్ బాగానే ఉన్నారు. అయితే సందీప్ ఎంతసేపటికి ఇంట్లోనే ఉంటుండడంతో శ్రావణి కి అనుమానం వచ్చింది. దీంతో భర్తను నిలదీసింది. అయితే అతడు తనకు ఐఏఎస్ గా పనిచేయడం ఇష్టం లేదని, ట్రైనింగ్ పూర్తయిన మారుమూల జిల్లాకు తనను అధికారిగా నియమించారని, అందువల్లే తాను ఐఏఎస్ పోస్ట్ కు రాజీనామా చేశానని చెప్పాడు. అయితే తాను రేడియాలజీ చదువుకున్నానని.. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్ గా పని చేసేందుకు కుదిరానని అన్నాడు. సందీప్ చెప్పిన మాటలను నమ్మిన శ్రావణి.. అతడు రేడియాలజిస్ట్ గా పని చేసేందుకు ఒప్పుకుంది. ఈ క్రమంలో వారిద్దరికీ ఒక కుమార్తె, కుమారుడు పుట్టాడు. ఇంట్లో గడవడం కోసం అతడు భారీగా బయట అప్పులు తెచ్చాడు. భార్యకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు.
ఇదే క్రమంలో చేస్తున్న ఉద్యోగంలో సంపాదన మొత్తం ఏం చేస్తున్నావని శ్రావణి అతడిని నిలదీసింది. “నేను రేడియాలజిస్ట్ గా పని చేస్తూ దాదాపు 40 కోట్ల దాకా సంపాదించాను. ఐటీ చెల్లించకపోవడంతో అయితే ఆ డబ్బు మొత్తం ఆదాయపు పన్ను శాఖ వారు సీజ్ చేశారు. నేను ఐటీ దాదాపు రెండు కోట్ల దాకా చెల్లించాలని” భార్యను నమ్మ బలికించాడు. ఇది నిజమే అని నమ్మిన శ్రావణి.. తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ద్వారా రెండు కోట్లను సేకరించి అతడి చేతుల్లో పెట్టింది. అయితే ఆ రెండు కోట్లను ఇచ్చిన తర్వాత ఎంతసేపటికి తిరిగి ఇవ్వకపోవడం.. పైగా ఆ 40 కోట్లను తనకు చూపించకపోవడంతో శ్రావణి కి అనుమానం కలిగింది. ఇదే క్రమంలో ఆ రెండు కోట్లను సందీప్ తన తండ్రి విజయకుమార్, అమెరికాలో ఉంటున్న తన చెల్లెలు లక్ష్మీ సాహితి ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేశాడు. అంతేకాదు తన పెళ్లి సమయంలో ఇచ్చిన నగలను మొత్తం తల్లి మాలతికి ఇస్తే.. ఆమె బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకుంది..
ఇదే సమయంలో సందీప్ కుమార్ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించగా.. ఐఏఎస్, రేడియాలజిస్ట్ పత్రాలు మొత్తం నకిలీవని తేలింది. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన శ్రావణి.. భర్తను నిలదీసింది. దీంతో అతడు తనలో ఉన్న రాక్షసున్ని నిద్ర లేపాడు. అదనపు కట్నం తేవాలని శ్రావణి వేధించడం మొదలు పెట్టాడు. ఆమెపై భౌతికదాడికి కూడా దిగాడు.. దీనికి సందీప్ అమ్మానాన్నలు కూడా సహకరించడంతో శ్రావణి పరిస్థితి దారుణంగా మారింది. దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. వారి సలహా మేరకు హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు విచారణ చేపట్టారు. నిందితుడు సందీప్, అతడి తల్లిదండ్రులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. సందీప్ సోదరి లక్ష్మీసాహితి ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. అమెరికాలో ఉంటున్న ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Ias officer arrested for cheating
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com