Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఏ కంటెస్టెంట్ ని కూడా తక్కువ అంచనా వెయ్యకూడదు అనే విషయం, రోజులు గడిచే కొద్దీ అర్థం అవుతోంది. ప్రతీ కంటెస్టెంట్ లో ఎదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. ఆరంభం లో చాలా డల్ గా ఉన్నారు , హౌస్ లో అసలు ఏమి చేయడం లేదు , ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు అని మనకు అనిపించొచ్చు కానీ, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే పెర్ఫార్మన్స్ ని చూసి హౌస్ మేట్స్ తో పాటు , ప్రేక్షకులు కూడా షాక్ కి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక పోతే నేటి ఎపిసోడ్ లో సుధీర్ రెడ్డి ఒక రేంజ్ లో హైలైట్ అవ్వబోతున్నాడు. ఆయన గ్రాఫ్ చాలా మంది కంటెస్టెంట్స్ కంటే పెరిగే అవకాశం ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే , రెండవ ప్రోమో లో బ్లాక్ కీ అనే కాన్సెప్ట్ ని పరిచయం చేసాడు నాగార్జున. ఈ కీ ని ఉపయోగించి , హౌస్ మేట్స్ లో పవర్ కీస్ ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరిదో ఒకరిది రద్దు చేయొచ్చు. ఎవరికీ ఈ కీ దక్కాలో చెప్పాల్సిందిగా నాగార్జున కోరగా, అత్యధిక శాతం మంది కంటెస్టెంట్స్ శ్రేష్టి పేరు చెప్తారు. దీంతో శ్రేష్టి వద్ద ఉన్నటువంటి పవర్ కీ రద్దు అయ్యింది. ఈ పవర్ కీ కోసం , ఇప్పటి వరకు పవర్ కీ గెలవని రోహిత్, అమన్ , దేబ్జాని , సుధీర్ రెడ్డి లకు ఒక టాస్క్ పెడుతారు. ఈ టాస్క్ లో సుధీర్ రెడ్డి గెలిచి , ఆ పవర్ కీ ని సొంతం చేసుకుంటాడట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి ఎపిసోడ్ ఆరంభం లో శ్రేష్టి వద్ద కూర్చొని సుధీర్ రెడ్డి ‘నాకు గేమ్ ఆడే అవకాశం రావడం లేదు’ అంటూ చెప్పుకొస్తాడు.
ఇప్పుడు ఆయనకు గేమ్ ఆడే అవకాశం వచ్చింది , ఏకంగా రోహిత్ లాంటి తోపు కంటెస్టెంట్ ని ఓడించి మరీ గెలిచాడు. ఇది సుధీర్ రెడ్డి కి చాలా హైప్ ని పెంచే అంశం అని చెప్పొచ్చు. వాస్తవానికి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అయితే ఈరోజు ఆయన ఎలిమినేట్ అవ్వాలి. కానీ అది జరగలేదు. పైగా అతనిలోని టాలెంట్ బయటపడింది. ఇతను సామాన్యమైన కంటెస్టెంట్ కాదు అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది. ఇక నుండి ఈయన గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి. మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ , రోహిత్ , త్రిగున్ , ముకేశ్ లతో సమానంగా పోటీ పడి అదెంత కెపాసిటీ ఈయనకు ఉంది, మరి తన కెపాసిటీ ని బయటకు తీస్తాడా?, లేదంటే శ్రేష్టి పులిహోర కలపడం లో బిజీ అవుతాడా అనేది చూడాలి.