Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన లేడీ కంటెస్టెంట్స్ లో అందమైన లేడీ కంటెస్టెంట్ గా దేబ్జాని కి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో ఈమెకు ఉన్న క్రేజ్ మామూలుది. అలాంటి క్రేజ్ ఉన్న ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు , ఈమెతో హౌస్ లో మేల్ కంటెస్టెంట్స్ పులిహోర ఒక రేంజ్ లో కలుపుతారని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఇప్పటి వరకు ఈమెతో లవ్ ట్రాక్ కలిపే ప్రయత్నం చేయలేదు. కానీ కాసేపటి క్రితం విడుదల చేసిన ప్రోమో లో , ఈమె డైరెక్ట్ గా ముకేశ్ కి పులిహోర కలపడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంత అందమైన అమ్మాయి , నేషనల్ టెలివిజన్ లో అందరి ముందు ప్రొపోజ్ చేసిందంటే , కచ్చితంగా ఈమెకు ఆయనపై నిజమైన ఫీలింగ్స్ ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
ఈ ప్రోమో లో ఆమె మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు నేను చెప్పలేదు కానీ , హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి నాకు ముకేశ్ అంటే చాలా ఇష్టం. అతను అటు పక్క పులిహోర కలుపుతాడు , ఇటు పక్క పులిహోర కలుపుతాడు , కానీ నా దగ్గరకు మాత్రం రావడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది దేబ్జాని. ఇంత పబ్లిక్ గా కోట్లాది మంది ప్రేక్షకుల ముందు ప్రపోజ్ చేయడం తో ముకేశ్ నోటి నుండి మాట రాలేదు , నాగార్జున కూడా షాక్ కి గురయ్యాడు. ఇదంతా చూస్తుంటే త్వరలోనే వీళ్ళ మధ్య మంచి లవ్ ట్రాక్ నడిచేలా ఉందని అనిపిస్తోంది. మరి ముకేశ్ రియాక్షన్ ఎలా ఉన్నింది?, దేబ్జాని ప్రపోజల్ ని అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి. మరో పక్క ముకేశ్ తో వర్షిణి కూడా పులిహోర కలుపుతోంది.
ఇలా హౌస్ లోని లేడీ కంటెస్టెంట్స్ అందరికీ ముకేశ్ తెగ నచ్చేస్తున్నాడు. ఒక్క షాలిని , శ్రేష్టి లు మాత్రమే రోహిత్ కి దగ్గరగా ఉన్నారు. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడైనా , ఏదైనా జరగొచ్చు కాబట్టి , వీళ్ళు కూడా ముకేశ్ తో రాబోయే రోజుల్లో పులిహోర కలుపుతారేమో చూడాలి. ఇదంతా పక్కన పెడితే నేడు ఎలాంటి ఎలిమినేషన్ లేదట. సుధీర్ రెడ్డి ఎలిమినేట్ అయ్యాడు అనే వార్త వచ్చింది కానీ, అందులో ఎలాంటి నిజం లేదట. సుధీర్ రెడ్డి , కృష్ణుడు.. ఇద్దరు కూడా చివరి రెండు స్థానాల్లో ఉన్నారని , వీళ్లిద్దరు ప్రస్తుతం హై రిస్క్ జోన్ లో ఉన్నారని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.