Romanchakam Movie Review : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి మారిపోయింది. ఇండియాలోనే మన ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తుంటే, యంగ్ హీరోలు మీడియం రేంజ్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయగలుగుతున్నారు. ఇక సుమంత్ ప్రభాస్ లాంటి నటుడు సైతం డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నాడు. ‘మేము ఫేమస్’ సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత ‘గోదారి గట్టు పైన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన తన నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఇప్పుడు ‘రోమాంచకం’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఈరోజు రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడికి నచ్చిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
అన్వేష్ (సుమంత్ ప్రభాస్) అనే ఒక హైదరాబాద్ కి చెందిన కుర్రాడు డేటింగ్ యాప్ ను క్రియేట్ చేస్తాడు. అందులో అతనికి మైథిలి (అనంతిక) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె చెన్నై లో ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. దాంతో మైథిలి చెన్నై నుంచి అన్వేష్ ను కలువడానికి హైదరాబాద్ వస్తుంది… అక్కడ ఒక ప్లాట్ లో అన్వేష్ – మైథిలి రెండు రోజులు కలిసి ఉండాలని అనుకుంటారు. కానీ అనుకోకుండా మైథిలి మిస్ అవుతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళింది. అన్వేష్ – మైథిలి ఇద్దరు చివర్లో కలుసుకున్నారా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
దర్శకుడు ఎంచుకున్న కథలో పెద్దగా వైవిధ్యమైతే లేదు. ఏదో కథను అలా నడిపించే ప్రయత్నం చేశారు… నిజానికి జన్ జీ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు. కానీ అందులో పెయిన్ అయితే కనిపించలేదు… కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నప్పటికి ఎమోషనల్ గా మనసుకు తాకే సన్నివేశాలు మాత్రం కరువయ్యాయి… అందుకే సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తాం. కానీ సినిమా చూశాక బాగుందా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకే సమాధానం దొరకదు.
బాగుంది అంటే ఇందులో ఏ సీన్ బాగుందో చెప్పలేము… బాగోలేదా అంటే సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేశాము కదా అని అనిపిస్తుంది… మొత్తానికైతే దర్శకుడు సినిమాను అలా నడిపించడంతే, ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. సుమంత్ ప్రభాస్ యాక్టింగ్ బాగుంది… ఆయన ఫ్రెండ్ గా నటించిన నటులు సైతం చాలా బాగా నటించి మెప్పించారు… దర్శకుడు సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కామెడీ చేసి పారేశాడు. దాంతో సినిమాలో సీరియస్ నెస్ కనిపించలేదు… స్క్రిప్ట్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది…కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ఓకే అనిపించినప్పటికి అన్ని పెర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు…అందుకే సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా ఒకే అనిపించే దగ్గరే ఆగిపోయింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
సుమంత్ ప్రభాస్ ఈ సినిమాకు చాలా బాగా సెట్ అయ్యాడు… కొన్ని సీన్స్ లో తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేశాడు. అలాగే చాలా ఈజ్ తో నటిస్తూ పెర్ఫెక్ట్ టైమింగ్ లో కామెడీ పంచులు వేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు… హీరోయిన్ అనంతిక సైతం జెన్ జీ అమ్మాయిలా పెర్ఫెక్ట్ గా నటించింది. ముఖ్యంగా ఆమె తన పాత్రలో ఒదిగిపోయి నటించింది…ఉపేంద్ర సైతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే యాక్టింగ్ తో మెప్పించాడు… ఇక హీరో ఫ్రెండ్స్ గా చేసిన నటులు సైతం సినిమాను ముందుకు తీసుకెళ్లడం లో చాలా కష్టపడ్డారు… మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఈ మూవీలో మ్యూజిక్ బాగుంది. పాటలు వింటున్నంత సేపు పెర్ఫెక్ట్ గా ఉన్నాయనే ఫీల్ కలుగుతుంది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది… అలాగే డిఓపి వర్క్ బాగుంది. ప్రతి షాట్ ను పెర్ఫెక్ట్ గా డిజైన్ చేసి తీశారు… ఎక్కడ కూడా డివియెట్ అవ్వకుండా అనుకున్న షాట్స్ తీయడం అనేది మామూలు విషయం కాదు… సినిమాటోగ్రాఫర్ సీన్స్ లోని డెప్త్ ను పట్టుకొని చాలా బాగా తీశాడు… ప్రొడక్షన్ వాల్యూస్ సైతం బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
సుమంత్ ప్రభాస్ యాక్టింగ్
రెండు సాంగ్స్
క్లైమాక్స్ కామెడీ…
మైనస్ పాయింట్స్
కథ
ఎమోషనల్ కనెక్టివిటి మిస్ అయింది.
కొన్ని సీన్స్ లాగ్ అయ్యాయి…
రేటింగ్ : 2/5