Romanchakam Movie Review : సినిమా ఇండస్ట్రీలో యూత్ ఫుల్ సినిమాలకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఎవరైతే ప్రేక్షకులను ఆకట్టుకుంటారో ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ను తమ వైపు తిప్పుకుంటారో ఆ సినిమాలు ఈజీగా సక్సెస్ లను సాధిస్తాయి. కారణం ఏంటంటే మూవీ యూత్ కి కనెక్ట్ అయిందంటే చాలు ఆ సినిమాను ఒకటికి రెండుసార్లు చూసి కలెక్షన్స్ ను పెంచే పనిలో యూత్ ఉంటారు. కాబట్టి వాళ్లకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాలు ఉండాలనే ఉద్దేశ్యంతోనే మన దర్శక నిర్మాతలు సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సుమంత్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన ‘రోమాంచకం’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయినప్పటికి ఈ సినిమాకి నిన్న నైట్ నుంచే ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ ని చూసిన ప్రతి ఒక్కరు సినిమాకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ సోషల్ మీడియా మొత్తం కొన్ని వార్తలను వైరల్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో కామెడీ, సుమంత్ ప్రభాస్ యాక్టింగ్ ప్లస్ అయ్యాయి…
కానీ ఎమోషన్ మిస్ అయింది. హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా అంత పర్ఫెక్ట్ గా పోట్రే అవ్వలేదు. దానికి తోడుగా ఈ సినిమాలో కథ లో కూడా పెద్దగా వైవిధ్యం లేకపోవడంతో సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది. ప్రేక్షకులందరి నుంచి మంచి రెస్పాన్స్ ను రాపడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులపాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…
మొత్తానికైతే సుమంత్ ప్రభాస్ ఈ సంవత్సరం తన రెండో సినిమాని రిలీజ్ చేశాడు. గత మూడు నెలల క్రితమే ‘గోదారి గట్టు పైన’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ‘రోమాంచకం’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మైమరిపింప జేయడానికి సన్నాహాలు చేసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…