Romanchakam First Review: సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు. భద్రకాళి ప్రొడక్షన్స్ పైన తన సినిమాలు తనే నిర్మించుకోవడం విశేషం… మొదటిసారి ‘రోమాంచకం’ అనే సినిమాను చేస్తున్నాడు. తన దగ్గర వర్క్ చేసిన వేణు గోపాల్ రెడ్డి అనే కుర్రాడిని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ను సాధించాలని దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అలాగే అమ్మాయి సైతం అతన్ని ప్రేమిస్తుంది ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ల కెరియర్ పరంగా వాళ్ళు ఎంచుకున్న గోల్స్ వాళ్లకు చాలా వరకు ఇబ్బందిని కలిగిస్తాయట. దాంతో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఫైనల్ గా ఇద్దరు ఒకటయ్యారా? లేదా అనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది.
మొత్తానికైతే ఈ సినిమా అర్జున్ రెడ్డి బాటలోనే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అంటూ సినిమా యూనిట్ చెబుతున్నారు. అలాగే ఈ సినిమాని రీసెంట్ గా కొంతమంది సినిమా పెద్దలకి ప్రివ్యూ వేసి చూపించారట. వాళ్ళు చూసిన దాన్నిబట్టి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధించబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.
పర్ఫామెన్స్ వైస్ గా సుమంత్ ప్రభాస్ అద్భుతంగా నటించినట్టుగా కూడా చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగా బ్యానర్ లో వస్తున్న ఈ చిన్న సినిమా భారీ విజయాన్ని సాధించబోతుందనేది సినిమా రిలీజ్ కి ముందే ఒక న్యూస్ బయటికి రావడం నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి…
సెప్టెంబర్ 3వ తేదీ వస్తేగానీ ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఈ సినిమా కంటెంట్ ఎలా ఉంటుందనేది తెలియదు… ఒకవేళ ఈ మూవీ సక్సెస్ అయితే సందీప్ రెడ్డి వంగ ఈ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేసే అవకాశమైతే ఉంది…