Ee Nagaraniki Emaindi 2: అప్పట్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా సంచలనం సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ కు స్టార్ డం తీసుకొచ్చింది. విశ్వక్ సేన్ ను యూత్ ఆడియన్స్ కి దగ్గర చేసింది. అభినవ్ గోమటాన్ని న్యూ ఏజ్ కమెడియన్ గా మార్చింది. అయితే ఇన్నాళ్లకు ఏ సినిమాకు రెండవ భాగం వచ్చింది. విశ్వక్ సేన్.. అభినవ్ గోమటం ప్రధాన పాత్రలలో తరుణ్ భాస్కర్ దశకత్వం వహించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
2018లో ఈ నగరానికి ఏమైంది మొదటి భాగం విడుదలైంది. యువతలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సహజమైన సంభాషణలు.. కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పుడు అదే బృందం మరోసారి ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.. మరి రెండో భాగం ఎలా ఉంది.. మొదటి భాగం స్థాయిలో మ్యాజిక్ సృష్టించిందా.. అనేది ఈ రివ్యూ లో చూద్దాం
కథ ఎలా ఉందంటే
మొదటి భాగంలో సినిమా తీయాలి అనేకలతో నలుగురు స్నేహితులు వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్ గోమటం), ఉప్పి (వెంకటేష్ కాకుమాను), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి) తమ జీవితాలలో స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్లు తీసిన సినిమా ఫ్లాప్ అవుతుంది. దీంతో ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ జీవిస్తుంటారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరు కలుసుకుంటారు. కార్తీక్ చెల్లెలు కీర్తన (శివాత్మిక రాజశేఖర్) పెళ్లి వ్యవహారం వీళ్ళ జీవితాలలో కొత్త మలుపులు తీసుకొస్తుంది. అనుకోని పరిణామాల మధ్య పెళ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత కీర్తన తండ్రి షరతులు పెడతారు. దీంతో కదా ముందుకు వెళుతుంది. ఈ నేబద్యంలో తమకు వచ్చిన సవాల్ ను ఈ నలుగురు స్నేహితులు స్వీకరిస్తారు. మరో సినిమాను తీయాలి అనుకుంటారు.. మరి వారు తీసిన సినిమా విజయం సాధిస్తుందా.. లేదా అనేది మిగతా కథ..
ఈ సినిమాకు ప్రధాన బలం నలుగురు స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు. వాళ్లు మాట్లాడుకునే సహజ సంభాషణలు.. చిన్న చిన్న గొడవలు.. సరదా సంఘటనలు కథను సాఫీగా ముందుకు తీసుకెళ్తాయి. ముఖ్యంగా మొదటి భాగంలో కనిపించిన స్నేహాన్ని కొనసాగించడానికి దర్శకుడు ఈ సినిమాలో తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కథను ప్రారంభించేందుకు కొంత సమయం తీసుకోవడంతో ఆడియన్స్ లో కొంత నిరాశను కలిగిస్తుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయి.
ఇక సెకండ్ ఆఫ్ విషయానికొస్తే కథ కాస్త స్లోగా సాగుతుంది. కథనం కూడా గందరగోళానికి గురిచేస్తుంది. కామెడీ కూడా కొన్ని సన్నివేశాలలో మాత్రమే వర్కౌట్ అయింది. అయితే చివరి 40 నిమిషాలు మాత్రం ఈ సినిమాను నిలబెడతాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చే సన్నివేశాలు.. కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక ఇతర దర్శకుల గెస్ట్ అప్పీయరెన్స్ కూడా ఈ సినిమాకు ప్రధాన బలం.
ఈ సినిమాను వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ ముందుకు తీసుకెళ్లాడు. మొదటి భాగంలో మాదిరిగానే.. రెండో భాగం లో కూడా ఆకట్టుకున్నాడు. అభినవ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈయన కామెడీ టైమింగ్.. డైలాగ్ డెలివరీ నవ్వులు పూయిస్తుంది. ఉప్పి పాత్రలో వెంకటేష్ కాకుమాను తనదైన అమాయకత్వంతో మెప్పించారు. కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి పర్వాలేదు. శివాత్మిక రాజశేఖర్.. అనిషా అంబ్రోస్ తమ పాత్రల పరిధిలో నటించారు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తనదైన శైలిలో రూపొందించారు. వివేక్ సాగర్ సంగీతం జెన్ జడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఏజే అరుణ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని సీన్లలో ఆయన పనితీరు కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మరి కాస్త కత్తెర పెడితే బాగుంటుంది.
నలుగురు స్నేహితుల కామెడీ.. అభినవ్ నటన.. కొన్ని కామెడీ ఎపిసోడ్లు.. క్లైమాక్స్.. గెస్ట్ అప్పియరెన్స్.. సంగీతం.. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం.
నెమ్మదిగా సాగే కథనం.. గొప్పగా చెప్పుకునే కథ లేకపోవడం.. ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాలలో కామెడీ పండకపోవడం.. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపించడం ఈ సినిమాకు మైనస్ పాయింట్లు..
మొత్తంగా చూస్తే ఈ నగరానికి ఏమైంది మొదటి భాగాన్ని ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అయితే ఆ భాగం ఇష్టపడిన వారికి రెండో భాగం కూడా నచ్చుతుంది. ముఖ్యంగా స్నేహితులతో కలిసి సరదాగా సినిమా చూడాలి అనుకునే వారికి ఇది ఉత్తమమైన ఎంపిక. అయితే మొదటి భాగంలో ఉన్న న్యాచురాలిటీ.. మ్యాజిక్ సెకండ్ భాగంలో రిపీట్ కాలేదు. సెకండ్ పార్ట్ లో కథ కంటే కేవలం కామెడీ మీదనే దర్శకుడు ఎక్కువగా ఆధారపడ్డారు.
మొత్తంగా మా రేటింగ్ ఈ సినిమాకి సంబంధించి 2.7/5
ఫైనల్ గా చెప్పాలంటే ఈ నగరానికి ఏమైంది2.. కొంతమందికి మాత్రమే ఎక్కుతుంది.