This Week Telugu Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో చాలామంది హీరోలు తమకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రతివారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు కొన్ని సినిమాలకు మాత్రం సక్సెస్ ఫుల్ టాక్ వస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ వారం కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాల రిజల్ట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
విశ్వనాథ్ అండ్ సన్స్
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ సినిమా ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని సెకండ్ హాఫ్ సైతం ప్రేక్షకులను ఎమోషనల్ గా మార్చిందంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతానికైతే సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…
అగధ
కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్ లో ఎమ్మెస్ రాజు దర్శకుడిగా చేసిన ‘అగాధ’ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కినప్పటికి సినిమాలో హార్రర్ సీన్స్ ఏం లేకపోవడంతో వాళ్ళు చాలా వరకు డిసపాయింట్ అయ్యారు… దాంతో ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
మకుటం
విశాల్ హీరోగా చేసిన ‘మకుటం’ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమా సైతం ప్రేక్షకుల్లో ఏమాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేదు. ఈ మూవీ మీద మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలో విశాల్ డిఫరెంట్ గా కనిపించే ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు…
పళ్ళ బురుసు
అక్కినేని నాగార్జున ప్రొడ్యూసర్ గా ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇద్దరు లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయింది… దాంతో ఈ మూవీని చూడటానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తుండటం విశేషం…
హుషారు పిట్టలు
యూత్ ఫుల్ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంటడం దీనికి బాగా హెల్ప్ అయింది…మొత్తానికైతే ఈ మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తుంది…