Homeఎంటర్టైన్మెంట్Sing Geetham Movie Collections: 'సింగ్ గీతం' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. పాజిటివ్ టాక్...

Sing Geetham Movie Collections: ‘సింగ్ గీతం’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ డిజాస్టర్ గా మిగిలింది..

Sing Geetham Movie Collections: రీసెంట్ గా విడుదలైన చిత్రాల్లో ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘సింగ్ గీతం’. 94 ఏళ్ళ వయస్సులో , సినిమా మీద ప్యాషన్ తో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి కూడా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి .పాటలతో సినిమా అనే సరికొత్త ప్రయోగం తో సింగీతం శ్రీనివాస రావు రూపొందించిన ఈ చిత్రం , ఒక అద్భుతమైన ప్రయోగమని , […]

Sing Geetham Movie Collections: రీసెంట్ గా విడుదలైన చిత్రాల్లో ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘సింగ్ గీతం’. 94 ఏళ్ళ వయస్సులో , సినిమా మీద ప్యాషన్ తో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి కూడా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి .పాటలతో సినిమా అనే సరికొత్త ప్రయోగం తో సింగీతం శ్రీనివాస రావు రూపొందించిన ఈ చిత్రం , ఒక అద్భుతమైన ప్రయోగమని , ఈ కాలం లో ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకొని సినిమా చేయడం కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమని , ఇలాంటి సినిమాలను ఆడియన్స్ కమర్షియల్ గా కూడా ఆదరిస్తే బాగుంటుందని చూసిన వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఈ చిత్రం ఓవరాల్ గా థియేట్రికల్ రన్ పరంగా డిజాస్టర్ గా నిల్చింది.

ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ మరియు షేర్ వసూళ్ళు ఎంతో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 5 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, 2 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి ఈ చిత్రానికి 2 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 7 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 3 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా పూర్తి స్థాయి లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

కానీ ఆ అందులో కేవలం సగం వసూళ్లను మాత్రమే ఈ చిత్రం రాబట్టిగలిగింది. ఓవరాల్ గా ఒక మంచి సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలినట్టు అయ్యింది చివరికి. మన టాలీవుడ్ లో ఆడియన్స్ రొటీన్ సినిమాలను చూసి విసిగిపోయాము , కొత్త తరహా ప్రయోగాత్మక చిత్రాలను అందించండి అంటూ పెద్ద రేంజ్ లో గొడవ చేస్తారు. కానీ అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ఆదరించరు . 94 ఏళ్ళ వయస్సులో పని చెయ్యాలని సింగీతం శ్రీనివాస్ కి ఎందుకు ఉంటుంది చెప్పండి?, పని మీద ప్రేమ కారణంగా ఆడియన్స్ కి ఒక సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించాలనే కసి తో పని చేసాడు , కనీసం అందుకోసం అయినా మన మూవీ లవర్స్ ఒక్కసారి ఈ చిత్రాన్ని చూసి ఉండాల్సింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper