Jailer 2 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్ 2’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకు వస్తున్న వసూళ్లను చూసి , ట్రేడ్ విశ్లేషకులు విస్తుపోతున్నారు. ఈమధ్య కాలం లో ఓవర్సీస్ లో ఈ రేంజ్ వసూళ్లను ఒక తమిళ సినిమాకు చూడలేదని కామెంట్ చేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే 10.8 మిలియన్ డాలర్లు , అనగా 102 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం ఓవర్సీస్ నుండి రాబట్టింది అట. మరి ఇండియా లో ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయి?, ఇంకా ఎంత వసూళ్లను రాబడితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రం తమిళ నాడు ప్రాంతం నుండి కేవలం రెండు రోజుల్లోనే 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట. నేడు నిన్నటి కంటే ఎక్కువ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి 24 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కర్ణాటక నుండి 21 కోట్ల 50 లక్షలు , కేరళ నుండి 20 కోట్ల 15 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 8 కోట్ల 10 లక్షల రూపాయిలను రాబట్టిందట . హిందీ లో ఈ చిత్రం నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో విడుదల అవ్వలేదు. అయినప్పటికీ కూడా 8 కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టడం అనేది సాధారమైన విషయం కాదు.
ఇక ఓవర్సీస్ లో 102 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి వైరల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 218 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను , 106 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా ఈ చిత్రం 200 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.